»   » కన్నీళ్ళు దానికి కాదు..నోటికొచ్చింది రాయొద్దు

కన్నీళ్ళు దానికి కాదు..నోటికొచ్చింది రాయొద్దు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఐఫా ఉత్సవాల్లో హీరోయిన్ ఛార్మి ఏడ్చిందంటూ మీడియాలో ప్రముఖంగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె ఏడ్చారనే విషయం రాయటంతో పాటు ..అందుకు దేవిశ్రీప్రసాద్ తో గతంలో ఉన్న రిలేషన్ ని గుర్తు చేస్తూ న్యూస్ లు రాసేసారు కొందరు. ఈ విషయంలో ఛార్మి హర్ట్ అయినట్లున్నారు. వెంటనే సోషల్‌మీడియా ద్వారా ఈ క్రింద విధంగా స్పందించారు.

ఆ వివరణలో ఆమె చెప్తూ.. ఐఫా ఉత్సవాల్లో భాగంగా సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తన తండ్రికి అంకితమిచ్చిన ‘నాన్నకు ప్రేమతో' పాట పాడారు. ఈ పాటను ఆయన స్టేజ్‌పై పాడుతుంటే భావోద్వేగానికి గురయ్యాయని, దేవిశ్రీ తండ్రి సత్యమూర్తితో తనకున్న అనుబంధం అలాంటిదని ఛార్మి వివరించారు.

ఆ సమయంలో తాను ఎమోషన్ ని ఆపుకోలేకోపోయానని అన్నారు. ఇలాంటి సున్నిత విషయాలను ప్రచురించే ముందు జాగ్రత్తగా వ్యవహరించాలని కోరారు. ఇక ఐఫా ఉత్సవంలో, నాన్నకు ప్రేమతో సినిమాలో ని టైటిల్ సాంగ్ ను తన తండ్రి కోసం పాడిన దేవిశ్రీని చూసినప్పుడు చార్మి కరిగిపోయి, ఏడుస్తుంటే పక్కనున్న శ్రేయా ఓదార్చింది. దేవిశ్రీ తండ్రి మరణంతో చార్మి ఎమోషనల్ అవ్వడం చూసినవారందరికి బాధను కలిగించింది.

English summary
Charmy tweeted about why she was cry IIFA Utsavam
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu