»   » టాయిలెట్ డే రన్: నక్లెస్ రోడ్లో చార్మి సందడి (ఫోటోస్)

టాయిలెట్ డే రన్: నక్లెస్ రోడ్లో చార్మి సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నవంబర్ 19 ‘వరల్డ్ టాయిలెట్ డే' సందర్భంగా సులభ్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ర్యాలీలో తెలుగు హీరోయిన్ చార్మీ కౌర్ పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత, మరుగుదొడ్ల నిర్వాహణ వంటి అంశాలు మానవ జీవనంలో చాలా ముఖ్యమైనవని, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇటువంటి అంశాల పట్ల ప్రజలు దృష్టి సారిస్తున్నారని చార్మీ అన్నారు.

అందరికీ మరుగుదొడ్లు, సానిటేషన్ ఈజ్ ఎ హ్యూమన్ రైట్ అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నక్లెస్ రోడ్లో జరిగిన ర్యాలీలో చార్మి పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కంటే మిన్న పరిశుభ్రత అనే మహాత్మాగాంధీ నినాదాన్ని ఈ సందర్భంగా నిర్వాహకులు గుర్తు చేసారు.

చాలా మంది చెప్పడానికో , మాట్లాడడానికో ఇస్టపడకపోయినా మన జీవితాలలో టాయ్ లెట్ అనేది ప్రాధమిక అవసరాల జాబితాలోనిదే . చాలా మందికి దీనికోసం ప్రపంచవ్యాప్తం గా ఓ రోజు ఉందనే సంగతి అస్సలు తెలియనే తెలియదు . వరల్డ్ టయిలెట్ ఆర్గనైజేషన్‌(W.T.O) ప్రపంచ లాభేతర సంస్థ . ప్రపంచవ్యాప్తంగా టాయిలెట్ పరిశుభ్రతని మెరుగు పరిచే ఉద్దేశము తో ఏర్పాటైన సంస్థ . " శానిటేషన్‌ " అన్న అత్యంత సామాన్య విషయం గురించి అత్యధికుల దృస్టిని ఆకర్షింప జేసిన సంస్థ ఇది.

2001 లో 15 మంది సభ్యులతో ఏర్పాటైన ఈ సంస్థ ఇప్పుడు 58 దేశాలకు చెందిన 235 సభ్య సంస్థలు ఉన్నాయి. టాయిలెట్ మెరుగుదల , శానిటేషన్‌ ధ్యేయము గా ఇవి పనిచేస్తాయి . వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్‌ ఓ గ్లోబల్ నెట్ వర్క్ గా ఏర్పాటు చేశారు . అన్ని టాయిలెట్ మరియు శానిటేషన్‌ సంస్థలు ఒకదాని నుంచి మరొకటి విభిన్న అంశాల్ని తెలుసుకినేందుకు వీలుగా ఉన్న ఏకైక సేవా సంస్థ .

ర్యాలీని ప్రారంభిస్తున్న చార్మి

ర్యాలీని ప్రారంభిస్తున్న చార్మి

వరల్డ్ టాయిలెట్ డే సందర్భంగా నక్లెస్ రోడ్ లో ర్యాలీని ప్రారంభిస్తున్నచార్మి.

ప్లకార్డులు

ప్లకార్డులు

సానిటేషన్ ఈజ్ ఎ హ్యూమన్ రైట్ అనే ప్లకార్డులు ఈ ర్యాలీలో ప్రదర్శించారు.

మంచిపని కోసం..

మంచిపని కోసం..

ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా సమాజసేవ చేయడమే.

చార్మి

చార్మి

ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న చార్మికి నిర్వహికులు థాంక్స్ చెప్పారు.

English summary
Charmee Kaur in World Toilet Day Run at Necklace Road.
Please Wait while comments are loading...