»   » ఖరారు: పూరి జగన్నాథ్ డైరక్షన్... ఛార్మి సమర్పణ

ఖరారు: పూరి జగన్నాథ్ డైరక్షన్... ఛార్మి సమర్పణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఛార్మితో 'జ్యోతిలక్ష్మి': 'టెంపర్‌' తర్వాత పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహించనున్న చిత్రం ఖరారైంది. ఛార్మి ప్రధాన పాత్రలో 'జ్యోతిలక్ష్మి' పేరుతో ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. హీరోయిన్ ఓరియెంటెడ్ గా రూపొందే ఈ సినిమాకి ఛార్మి సమర్పకురాలిగా వ్యవహరిస్తుండడం విశేషం. శ్వేతలానా, వరుణ్‌-తేజ, సి.వి.రావు నిర్మాతలు. ఈ నెల 20న చిత్రీకరణ ప్రారంభిస్తున్నట్టు పూరి జగన్నాథ్‌ హైదరాబాద్‌లో తెలిపారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయిన సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ''పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కించాలనుకొన్నాం. అంతలోనే ఈ కథ తెరపైకి వచ్చింది. దీని తర్వాత వరుణ్‌తేజ్‌తో సినిమా ఉంటుంది. మా సంస్థలో పూరి జగన్నాథ్‌ మరిన్ని సినిమాలు చేస్తారు''అన్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే...

Charmi Kaur Presents puri Jagan movie

ఛార్మి కీలక పాత్రలో నటించనున్న సినిమా ‘జ్యోతిలక్ష్మి'. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌, శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఛార్మికౌర్‌ సమర్పిస్తున్నారు. పూరి జగన్నాథ్‌ దర్శకుడు. ఆయన మాట్లాడుతూ ‘‘ఈ నెల 20న ‘జ్యోతిలక్ష్మి'ని ప్రారంభిస్తాం. భవిష్యత్తులోనూ సి.కల్యాణ్‌గారితో కలిసి పలు సినిమాలకు పనిచేయాలనుకుంటున్నాను. ‘జ్యోతిలక్ష్మి' ఉమెన్‌ సెంట్రిక్‌ సినిమా'' అని అన్నారు.

సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘పూరిగారితో కలిసి ఈ ఏడాది రెండు ప్రాజెక్టులు చేయబోతున్నాను
జ్యోతిలక్ష్మి, వరుణ్‌ తేజ సినిమాలు మా కాంబినేషన్‌లో ఉంటాయి. మా పిల్లల పేర్ల మీద శ్రీ శుభశ్వేత ఫిలిమ్స్‌ను మొదలుపెట్టిన తర్వాత తొలి హిట్‌ ‘చంద్రకళ'తో కొట్టాను. రెండో సినిమాగా వరుణ్‌ సినిమా చేద్దామనుకున్నాం. కానీ ఈ నెల 20 నుంచి ‘జ్యోతిలక్ష్మి' చేస్తాం. తర్వాత వరుణ్‌ సినిమా ఉంటుంది'' అని తెలిపారు.

Charmi Kaur Presents puri Jagan movie

సత్య, వంశీ ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కెమెరా: పి.జి.విందా, సంగీతం: సునీల్‌ కశ్యప్‌, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్‌ - తేజ, సీవీ రావు, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

పూరి తాజా చిత్రం టెంపర్ విషయానికి వస్తే...

ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. మాగ్జిమం నెంబరాఫ్ థియోటర్స్ లో విడుదల అవుతున్న ఈ చిత్రం మొదటి షో హైదరాబాద్ భ్రమరాంబ థియోటర్ లో ఉదయం 5.07 నిముషాలకు విడుదల కానున్నదని సమాచారం. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేష్ ఈ విషయమై ప్రకటన చేసి ఉన్నారు. అలాగే .. భ్రమరాంబ థియోటర్ లో గతంలో బాలకృష్ణ లెజండ్ చిత్రం విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ లోగా సీడెడ్ లో చాలా చోట్ల 12 రాత్రి తెల్లారితే 13 అనగా షోలు పడతాయి. అయితే అఫీషియల్ గా ముహూర్తం మాత్రం భ్రమరాంబలో జరగనుంది.

English summary
Charmi will be acting in a movie titled 'Jyothi Lakshmi', which is going to be directed by Puri Jagannadh. This movie will be jointly produced on C.K.Entertainments Pvt.Ltd and Sri Shubha Swetha films banners. This will be a women centric film and will start on Feb 20th. The interesting news about this film is that Charmme will present this movie.
Please Wait while comments are loading...