»   » అరగుండు హెయిర్ స్టయిల్ ... అండర్ కట్ తో చార్మీ న్యూ లుక్

అరగుండు హెయిర్ స్టయిల్ ... అండర్ కట్ తో చార్మీ న్యూ లుక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవకాసశాలు లేకపోవటం తో బాగానే తీరిక దొరికినట్టుంది చార్మీ కి. చాలా కాలంగా అవకశాలేం లేవు చార్మికి. ఎదురు చూసీ..ఎదురు చూసీ ఆ మధ్య ఎపుడో చాలా కాలం తరువాత పూరీ జగన్నాద్ దర్శకత్వంలో "జ్యోతిలక్ష్మి" తీసినా, ప్రేక్షకులని ఆ సినిమా మెప్పించడంలో విఫలమైంది. దాంతో చార్మీ పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది. అందుకే , పబ్లిక్ లో కూడా ఎక్కువగా కనబడకుండా.....ఎక్కువ శాతం పూరీతో కలిసి సినిమా నిర్మాణాల పనులు, దాంతో పాటు ఇటీవలే పూరీ పొదలుపెట్టిన సెలెబ్రిటీ మేనేజ్మెంట్ కంపెనీ వ్యవహారాలు మాత్రమే చూసుకుంటూ బిజీ బిజీగా ఉంటోంది.

నిర్మాతగా ప్రయత్నాలు చేస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాని దీనిపై ఎలాంటి అఫీషియల్‌ న్యూస్ బయటకు రాలేదు. ఈవెంట్స్ కి కూడా ఈ మధ్య ఎక్కువగా హాజరు కావడం లేదు ఛార్మి. అయితే మొన్నామధ్య తన హెయిర్‌ని కట్‌ చేసి క్యాన్సర్ భాదితులకు అందజేసానని తెలిపింది ఛార్మి. ఇక అప్పటి నుండి షార్ట్ హెయిర్ తోనే దర్శనమిస్తోంది ఈ అమ్మడు.

 Charmme Kaur Buzzed It Off To Become Trendsetter with UnderCut

ఇక తాజాగా తన హెయిర్‌తో సరికొత్త స్టైల్స్ ని ట్రై చేస్తోంది. పొట్టిగా ఉన్న జుట్టుతోనే ప్రయోగాలు చేస్తున్నా, పెరిగితే ఎక్స్ పెరిమెంట్‌ చేసే ఛాన్స్ ఉండదు కదా .. అందుకే ఈ అండర్ కట్‌ ట్రెండ్‌ని ట్రై చేసానంటూ ఓ పిక్ ని కూడా పోస్ట్‌ చేసింది ఛార్మి. ఈ స్టైల్‌ని చూసి అభిమానులు మురిసిపోతుంటే అమ్మాయిలు కూడా అండర్ కట్ ని ట్రై చేయాలని భావిస్తున్నారట.

English summary
actress Charmme Kaur who has recently chopped off her 18 inches long lustrous hair has gone for another shocking makeover.!! She has shaved her nape to flaunt the famous Undercut.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu