»   »  ఛార్మి ఫుల్లుగా సహకరిస్తోంది..నో ప్లాబ్లం

ఛార్మి ఫుల్లుగా సహకరిస్తోంది..నో ప్లాబ్లం

Posted By:
Subscribe to Filmibeat Telugu

మంత్ర చిత్రం సమయంలో ఛార్మి ఆ చిత్ర ప్రమోషన్ కు రమ్మంటే హ్యాండ్ ఇఛ్చి నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు వరస ప్లాపుల్లో ఉండటం వలనో మరేమోగానీ తన తాజా చిత్రం 'మంగళ" కోసం ప్రమోషన్ వర్క్ కు ఎంత కష్టమైనా పడటానకి రెడీ అంటోంది. నిన్న (శనివారం) 'మంగళ" చిత్రానికి సంబంధించిన సక్సెస్ మీట్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఛార్మి మాట్లాడుతూ- 'మంగళ" రిలీజ్ ఎప్పుడా ఎప్పుడా అనుకున్నాను. ఎందుకంటే ఈ చిత్రానికి నేను పడ్డ శ్రమ అటువంటిది. ఇప్పటివరకు నేను 50 చిత్రాల్లో నటించాను.

అన్ని చిత్రాల్లో పడ్డ కష్టం ఒక ఎత్తయితే ఈ చిత్రానికి కష్టపడింది ఒకఎత్తు. ఇప్పుడు విజయవంతమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఒకరకంగా నా టెన్షనంతా పోయిందని తెలిపింది. చిత్ర దర్శకుడు ఓషో తులసీరామ్ మాట్లాడుతూ..ఈ చిత్రం మొదటినుండి విజయవంతమవుతుందన్న నమ్మకం ఉంది. తొలిరోజు ఆడియన్స్ మధ్య కూర్చుని చూసిన తర్వాతే నమ్మకం ఏర్పడింది. నైట్ ఎఫెక్ట్ సీన్‌లకు మంచి రెస్పాన్స్ వస్తోందన్నారు అన్నారు .అదీ సంగతి.

English summary
Charmi starrer Mangala film released with Flop talk. Mangala is directed by Osho Tulasi Ram, who has earlier directed 
 
 Mantra and made it an all-time hit for Charmi. Just like Mantra, Mangala is also a suspense thriller.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu