»   »  పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తున్న ఛార్మి

పవన్ కళ్యాణ్ ని అనుకరిస్తున్న ఛార్మి

Posted By:
Subscribe to Filmibeat Telugu
Charmy
తెలుగులో తనదైన ప్రత్యేక మానరిజమ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే నటుడు పవన్ కళ్యాణ్. అందుకే చాలామంది వర్ధమాన నటులు,మిమిక్రీ కళాకారులు ఆయన మేనరిజమ్స్ ని,డైలాగ్ డెలవరీనీ అనుకరించటానికి ప్రయత్నం చేస్తూంటారు.తాజాగా ఛార్మి ఆ పని చేయబోతోంది. చిన్న సినిమా "మంత్ర" సినిమా పెద్ద విజయం సాధించటంతో ఛార్మి దశ ఒక్కసారిగా తిరిగి పోయింది. అప్పటి నుంచీ ఆమెకి అన్నీ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలే వస్తున్నాయి. తాజాగా ఆమె తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో రూపొందుతున్న సినిమా "16 డేస్" చేస్తోంది. ప్రభు సాల్మన్ దర్శకుడుగా చేస్తున్న ఆ సినిమాలో ఆమె ఏంజిల్ అనే పాత్రను పోషిస్తోంది.

ఇక ఈ సినిమాలో ఛార్మి మిమిక్రీతో రకరకాల గొంతులను అనుకరిస్తుందిట. టాలీవుడ్ పెద్ద హీరోలు రవితేజ,పవన్ కళ్యాణ్ గొంతులను అనుకరించటం కోసం చాలా సీ.డీ లు వారివి చూసానని చెప్తోంది. ఆ డైలాగులు సినిమాలో హైలెట్ అవుతాయని దర్శకుడు భావిస్తున్నాడు. సినిమా మొత్తం 16 రోజుల కాలంలో జరిగే ఒక రొమాంటిక్ థ్రిల్లర్ . ఛార్మి చుట్టూనే కథ మొత్తం తిరుగుతుంది. హీరో హీరోయిన్ల మధ్య 16 రోజుల పాటు నడిచే కథట. అందుకే "16 డేస్" అనే టైటిల్ పెడుతున్నారు.

ఈ సినిమా కోసం చాలా పెద్ద మొత్తంలో రెమ్యూనరేషన్‌ తీసుకుంటోందని తెలుస్తోంది. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఫ్యూచర్ ఫిలిమ్స్ బానర్‌పై పి. మహేష్‌బాబు, డి. నాగేశ్వరరావు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం కొరియాగ్రాఫర్ చిన్ని ప్రకాష్ నేతృత్వంలో పాటల చిత్రీకరణ జరుగుతోంది. అందులో ఒక హాట్ సాంగ్ లో హారో అరవింద్ కి ఘాటుగా లిప్ టు లిప్ కిస్ కూడా ఇచ్చిందిట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X