»   » బాలకృష్ణ తో చార్మీ.? ఆమూడో పేరెందుకు చెప్పటం లేదు, ఎందుకింత సీక్రెసీ

బాలకృష్ణ తో చార్మీ.? ఆమూడో పేరెందుకు చెప్పటం లేదు, ఎందుకింత సీక్రెసీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

అప్పుడెప్పుడో దాదాపు 8 ఏళ్ల కిందట బాలయ్య సరసన నటించింది చార్మి. మళ్లీ ఇన్నేళ్లకు నటసింహంతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. అవును.. అన్నీ అనుకున్నట్టు జరిగితే బాలయ్య-పూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో చార్మి హీరోయిన్ గా నటించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కెరీర్ దాదాపు క్లోజ్ అయిపోయిందనుకున్న టైమ్ లో చార్మికి ఈ ఛాన్స్ రావడం నిజంగా గొప్ప విషయమే.

మరో ఉత్తరాది భామ

మరో ఉత్తరాది భామ

తన సినిమాలతో ఇప్పటికే చాలామంది నార్త్ బ్యూటీస్ ను టాలీవుడ్ కు పరిచయం చేశాడు పూరి. లోఫర్ తో దిశా పటానీ, ఇజమ్ తో అదితి ఆర్యను ఇండస్ట్రీని తీసుకొచ్చిన ఈ దర్శకుడు... రోగ్ తో ఏంజెలా అనే ముద్దుగుమ్మను కూడా పరిచయం చేసాడు. ఇప్పుడు ఇదే కోవలో బాలకృష్ణ సినిమాతో మరో ఉత్తరాది భామను తెలుగుతెరకు పరిచయం చేయబోతున్నాడట. అయితే ఆ అమ్మాయి ఎవరనే విషయాన్ని మాత్రం ప్రస్తుతానికి సీక్రెట్ గా ఉంచుతున్నారు.

ఒక హీరోయిన్ గా ముస్కాన్

ఒక హీరోయిన్ గా ముస్కాన్

ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు చోటుంది. వీళ్లలో ఒక హీరోయిన్ గా ముస్కాన్ ను ఇప్పటికే సెలక్ట్ చేశారు. ఇప్పుడు గా చార్మిని తీసుకునే అవకాశాల్ని పరిశీలిస్తున్నారు. అయితే ఇంకో ఇద్దరు హీరోయిన్లకు చాన్స్ ఉండగా ఒక పాట కోసం చార్మీని అనుకుంటున్నారట.అయితే ఈ స్పెషల్ సాంగ్ కి మాత్రమే పరిమితమా కథకి కూడా సంబందం ఉన్న పాత్ర ఉంటుందా అన్నది ఇంకా తెలియరాలేదు .

బాలయ్య, చార్మి కలిసి అల్లరిపిడుగు

బాలయ్య, చార్మి కలిసి అల్లరిపిడుగు

గతంలో బాలయ్య, చార్మి కలిసి అల్లరిపిడుగు సినిమా చేశారు. మళ్లీ ఇన్నేళ్లకు ఈ పంజాబీ బ్యూటీకి ఛాన్స్ ఇస్తున్నారు బాలకృష్ణ. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ఇష్యూ..త్వరలోనే ఫైనలైజ్ అయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసే పనిలో కూడా పూరి జగన్నాధ్ బిజీగా ఉన్నాడు.

పూరీ కనెక్ట్స్‌తో బిజీ అయింది

పూరీ కనెక్ట్స్‌తో బిజీ అయింది

ప్రస్తుతం ఆయన సినిమా వ్యవహారాలను కూడా చూసుకుంటోందట. జ్యోతిలక్ష్మీ సినిమాతో హాట్ బ్యూటీ ఛార్మికి హిట్ ఇవ్వాలని చూసిన పూరి జగన్నాథ్, ఆ ప్రయత్నంలో సక్సెస్ కాలేకపోయాడు. ఆ తర్వాత పూరీ కనెక్ట్స్‌తో బిజీ అయింది ఛార్మి. తాజాగా బాలకృష్ణతో సినిమా చేస్తున్న పూరీ, ఇందులో ఆమెకు ఐటమ్ సాంగ్‌ను కన్‌ఫామ్ చేశాడని టాక్.

బాలయ్య గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో

బాలయ్య గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో

ప్రస్తుతం పోర్చుగల్‌లో తెరకెక్కుతున్న బాలయ్య-పూరీ కాంబినేషన్ సినిమాలో ఐటం సాంగ్ ఛాన్స్ ఛార్మికి వస్తుందా రాదా అని భావించారు. అయితే రీసెంట్‌గా ఛార్మితో ఐటం సాంగ్‌కు బాలయ్య గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో, దీన్ని కాస్త భారీగా తెరకెక్కించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడట పూరీ జగన్నాథ్. ఐటం భామగా చాలా సినిమాల్లో కనిపించినా, పెద్దగా సక్సెస్ కాలేకపోయిన ఛార్మికి బాలయ్య కొత్త సినిమాతో అయినా మళ్లీ లైమ్ లైట్‌లోకి వస్తుందేమో చూడాలి.

English summary
The film is supposed to be titled Ustad as Balakrishna be playing the role of gangster in this movie. Charmi has been not into films from many years and this will be a great break her to work for. Charmi lost the charm in films many years back.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu