»   » ఛార్మీ మైకంలో మునిగే రోజు

ఛార్మీ మైకంలో మునిగే రోజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఛార్మి ప్రధాన పాత్ర పోషించిన చిత్రం 'ప్రేమ ఒక మైకం'. రాహుల్‌, శరణ్య జంటగా నటించారు. చందు దర్శకత్వం వహించారు. దుడ్డు వెంకట సురేష్‌, కె. సూర్య శ్రీకాంత్‌ నిర్మాతలు. ఈ చిత్రాన్ని ఈనెల 30న విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ''మల్లిక, లలిత్‌, స్వాతి.. ఈ ముగ్గురి కథ ఇది. ఈ ముగ్గురి జీవితాలతో ప్రేమ ఎలా ఆడుకుందనేది ఆసక్తికరం. వేశ్యగా ఛార్మి నటన ప్రధాన ఆకర్షణ. ఇటీవల విడుదల చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింద''న్నారు.

చిత్రం గురించి ఛార్మి మాట్లాడుతూ... అందరూ మల్లిక అందాన్ని చూశారు. ఎందుకంటే ఆమె ఓ వేశ్య కాబట్టి. ఆమెను అవమానించినవాళ్లే తప్ప... ఆప్యాయంగా పలకరించినవాళ్లు తక్కువ. అందుకే మల్లికకీ మానవ సంబంధాలపై నమ్మకం పోయింది. లలిత్‌ ఆమె జీవితంలోకి ప్రవేశించిన తరవాత ఆలోచనలో మార్పు వచ్చింది. ఆ మార్పు ఏ దిశగా అన్నది తెర మీదే చూడాలని చెప్పింది.

నిర్మాత మాట్లాడుతూ ''చీకట్లో పుట్టి చీకట్లో బతుకుతూ చీకట్లో కలిసిపోయే జీవితాలు మీవి అంటూ మల్లిక అవమానానికి గురవుతుంది. ఆ సమయంలోనే లలిత్‌ పరిచయమవుతాడు. అప్పుడామె తీసుకున్న నిర్ణయం ఏమిటన్నది తెర మీదే చూడాలి. మనసున్న మల్లికగా ఎలా నిలబడిందన్నది ఆసక్తికర అంశం. ఛార్మి నటన యువతకు నచ్చుతుంది''అన్నారు.

సోనీ చరిష్టా, సతీష్, చంద్రమోహన్, రావు రమేష్, తాగుబోతు రమేష్, పృథ్వీ, సురేఖ వాణి, చంటి, జాకీ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి మాటలు: పులగం సి. నారాయణ, కెమెరా: ప్రవీణ్ బంగారి, పాటలు: కుల శేఖర్, శశి, సమర్పణ: బేబీ హ్యాపీ.

English summary
Charmee, Rahul and Sharanya starrer Prema Oka Maikam is gearing up for release on Aug 30th. Chandu, who had earlier made 10th Class, has directed this film and it has been jointly produced by D Venkat Suresh and K Surya Srikanth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu