»   »  నితిన్ పై ఛార్మి నిన్న కామెంట్... ఈ రోజు క్షమాపణ

నితిన్ పై ఛార్మి నిన్న కామెంట్... ఈ రోజు క్షమాపణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :అసలు నాకూ, నితిన్ సినిమాకూ సంభంధం ఏమిటి...ఆ సినిమాను ప్రొడ్యూస్ చేయటానికి నితిన్ వద్ద డబ్బులు ..సో సినిమా ఆగిపోయింది. ఉన్న డబ్బులన్నీ అఖిల్ సినిమాకు పెట్టేయటం వల్లే ఈ సినిమా మొదలు కాలేదు...దానికి నేనెలా భాధ్యురాలిని అని ఛార్మి కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడా కామెంట్ ని ఆమె వెనక్కి తీసుకుంటోంది. తాను రూమర్స్ ని నమ్మి ఆ మాటలు అన్నానని సిన్సియర్ గా క్షమాపణ అడుగుతున్నట్లు తెలియచేసింది. ఆమె ఏమందో ఆమె ట్వీట్ ని మీరూ చదివి తెలుసుకోండి.

నితిన్, పూరి సినిమా ఎందుకు ఆగిందో నాకు తెలియదు. కానీ కొన్ని రూమర్స్ విని, ఫైనాన్సియల్ కారణాలు వల్లే అనుకోవటం జరిగింది. నేను చెక్ చేసుకుని మాట్లాడకపోవటం నా పొరపాటు. అందుకోసం నేను సిన్సియర్ గా క్షమాపణలు అడుగుతున్నాను అన్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అలాగే...నితిన్ తో చేయలేదు కాబట్టి వెంటనే పూరి మరో హీరోతో మరో ప్రొడ్యూసర్ తో సినిమాను ఎనౌన్స్ చేసారు. ఇక పూరి తో నా రిలేషన్ కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే. ఆయనకు ఓ ఫ్యామిలీ ఉంది. వారితో ఆయన ఎంతో క్లోజ్ గా ఉంటారు అంటూ చెప్పుకొచ్చిందామె.

Charmy says sorry to Nitin for wrong info

ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్, యంగ్ హీరో నితిన్ తో మరో సినిమా చేయనున్నారంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నితిన్, పూరి ఇద్దరూ కూడా ఖరారు చేసారు. మొన్ననే ఫైనల్ నేరేషన్ విన్నాను. సినిమా ఓ హార్ట్ టచ్చింగ్ పాయింట్ తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ..జూన్ 15 నుంచి షూటింగ్ అని నితిన్ ఆనందంగా కూడా ట్వీట్ చేసారు. అయితే ఇప్పుడా సినిమా ఆగిపోయింది. ఈ విషయాన్ని నితిన్ స్వయంగా ఖరారు చేసి మీడియాకు తెలియచేసారు.

నితిన్ ట్వీట్ చేస్తూ... కొన్ని అనివార్య కారణాల వల్ల పూరి జగన్నాధ్ గారితో నేను చేయాల్సిన సినిమాను ఆపేస్తున్నాం. ప్యూచర్ లో ఆయనతో పనిచేస్తానని ఆశిస్తున్నాను అని ట్విట్ చేసారు.

గతంలో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘ గతంలో నితిన్ నాకు ఒక మంచి వ్యక్తిగా తెలుసు. ఎప్పటి నుంచి అయితే అతనితో పనిచేసానో అప్పటి నుంచి అతనితో ప్రేమలో పడిపోయాను. అతను ఎంతో కష్టపడి పనిచేస్తాడు, అలాగే అతని ఎనర్జీ లెవల్స్ బాగా హై రేంజ్ లో ఉంటాయి. ఎప్పటి నుంచో సినిమా చెయ్యాలనుకుంటున్నాం అది ఇప్పటికి కుదిరింది.' అని అన్నాడు. మరి ఈ లోగా ఏం తేడాలో వచ్చాయో ఏంటో ఇలా కాన్సిల్ అయ్యింది ఈ ప్రాజెక్టు.

English summary
Actress Charmme Kaur tweeted : “Someone told me that they are facing financial troubles and I thought it is true. I am sorry”, she posted.
Please Wait while comments are loading...