»   » ఛార్మీ, చైతూ కలిసి దుబాయి కు...ఆల్రెడీ దేవీశ్రీప్రసాద్

ఛార్మీ, చైతూ కలిసి దుబాయి కు...ఆల్రెడీ దేవీశ్రీప్రసాద్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఛార్మి, నాగచైతన్య కలిసి ఎక్కడకో ప్రయాణం పెట్టుకున్నారని మీకు ఇక్కడ ప్లైట్ లో వెళ్తున్న వీరి ఫొటో చూస్తుంటే అర్దమవుతుంది. ఇంతకీ వీరిద్దరూ వెళ్ళేది సిమా 2015 వేడుకకు దుబాయికి. ఈ విశేషాన్ని ఛార్మి తన ట్వీట్ ద్వారా తన అబిమానులకు తెలియచేసింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

వరుసగా నాలుగో ఏడాది ఈ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈసారి 'సైమా' పండగ దుబాయ్‌లో జరగబోతోంది. గురు, శుక్రవారాల్లో 'సైమా' అవార్డు వేడుకను అట్టహాసంగా చేయబోతున్నారు.

తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలకు చెందిన సినీ తారలు, సాంకేతిక నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రముఖ కథానాయకుడు రానా సైమా వేడుకకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ తన ఆటపాటలతో అలరించడానికి సిద్ధమయ్యాడు.

Charmy with Naga Chaitanya @Plane

'సైమా' (సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌) అంటేనే సంబరం! దక్షిణాది తారలంతా ఓ చోట కలసి సందడి చేసే వేదిక.. వినోదాల వేడుక. ఆట పాటలు, ఆనందోత్సవాల సమ్మేళనం. మరోసారి ఈ పండుగకు రంగం సిద్ధమైంది.

శ్రియ, తాప్సి, ఆదాశర్మ, కృతి కర్బంద, షర్మిలా మాండ్రే, పూజా హెగ్డే.. వీళ్లంతా తమ ఆటపాటలతో అలరించడానికి సిద్ధమయ్యారు. 'సైమా' వేడుకల్లో ఈ కథానాయికలంతా సూపర్‌ హిట్‌ గీతాలకు నృత్యాలు చేయబోతున్నారు. బుధవారం ఈ హీరోయిన్స్ నృత్య సన్నాహాల్లో బిజీ బిజీగా గడిపారు. దేవిశ్రీ ప్రసాద్‌ తన ఆటపాటలతో అలరించడానికి సిద్ధమయ్యాడు.

ఆల్రెడీ దేవి శ్రీ ప్రసాద్ అక్కడకి చేరుకున్నారు... ఆ ఫొటో ఇక్కడ చూడండి

#SIIMA2015

Posted by Devi Sri Prasad on 5 August 2015
English summary
Charamy, Naga Chaitanya, and Devi Sri Prasad reached Dubai.
Please Wait while comments are loading...