»   » విడుదలకు సిద్దమైన ప్రభాస్ "ఛత్రపతి" : ఈ సారి ప్రభాస్ పేరు "చంద్రమౌళి"

విడుదలకు సిద్దమైన ప్రభాస్ "ఛత్రపతి" : ఈ సారి ప్రభాస్ పేరు "చంద్రమౌళి"

Posted By:
Subscribe to Filmibeat Telugu
Prabhas "Chatrapathi" Movie Releasing Tomorrow As "Chandramouli"

"ఛత్రపతి" ప్రభాస్ తో శ్రియ, ఆర్తి అగర్వాల్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా 2005లో వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో లో 'ఒక్క అడుగు.. ఒకే ఒక్క అడుగు' డైలాగ్ చాలా పాపులర్. ఆ డైలాగ్‌ ఆ సినిమాకు ప్రాణం పోసింది.

ఛత్రపతి

ఛత్రపతి

ఈ డైలాగ్‌ను టైటిల్‌గా పెట్టి ప్రభాస్‌తో సినిమా తీయాలని ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు అప్పట్లో భావించారు. టైటిల్‌ని రిజిస్టర్ కూడా చేయించడమే కాక కథ కూడా సిద్ధం చేయించారు. తన సొంత నిర్మాణ సంస్థ గోపి కృష్ణ బ్యానర్‌పై తానే దర్శకత్వ బాధ్యతలు చేపడుతూ ఈ సినిమా రూపొందించాలనేది కృష్ణంరాజు ఆలోచన.

మళ్ళీ రిలీజ్ కి సిద్దమయ్యింది

మళ్ళీ రిలీజ్ కి సిద్దమయ్యింది

అయితే, ప్రభాస్ బాహుబలి, బాహుబలి 2లతో బిజీ అయిపోవడం వల్ల ఈ ప్రాజెక్టు పక్కకెళ్లింది. ఈ ఒక్క అడుగు ని పక్కన పెట్టి మళ్ళీ మనం ఛత్రపతి దగ్గరకు వస్తే... అప్పట్లో ప్రభాస్ మార్కెట్ నీ, స్టార్ గా ప్రభాస్ రేంజ్ పెంచిన సినిమాగా చత్రపతిని చెప్పొచ్చు. అందుకే ఇప్పుడు ఆ సినిమా మళ్ళీ రిలీజ్ కి సిద్దమయ్యింది.

తెలుగులో కాదు తమిళంలో

తెలుగులో కాదు తమిళంలో

ఖంగారు పడకండీ ఇప్పుడు ఛత్రపతి విడుదలయ్యేది తెలుగులో కాదు తమిళంలో.. బాహుబలి హిట్ తర్వాత ప్రభాస్ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తుబ్న్నాయి అక్కడి నిర్మాణ సంస్థలు దాంతో ప్రభాస్ పాత సినిమాల హక్కులని కొనేసి డబ్ చేసి, "బాహుబలి ఫేమ్ ప్రభాస్ నటించిన" అనే ట్యాగ్ పోస్టర్లమీద వేసి మరీ ప్రభాస్ పాత సినిమాలని అక్కడ రిలీజ్ చేస్తున్నారు.

తమిళంలోకి అనువదించారు

తమిళంలోకి అనువదించారు

అదే ప్రయత్నం లో భాగంగా ఛత్రపతి ని కూడా తాజాగా తమిళంలోకి అనువదించారు. 'చంద్రమౌళి' పేరుతో ఈ సినిమాను రేపు అక్కడ రిలీజ్ చేస్తున్నారు. 'బాహుబలి' .. 'బాహుబలి 2' సినిమాలతో ప్రభాస్ కి తమిళంలోను క్రేజ్ పెరిగిపోయింది. అక్కడ కూడా ఆయన అభిమానుల సంఖ్య పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో తమిళ ప్రేక్షకుల ముందుకు వస్తోన్న 'చంద్రమౌళి' .. అక్కడ ఏ స్థాయి వసూళ్లను సాధింస్తుందో చూడాలి.

English summary
SS Rajamouli's astounding success with Naan Ee, the Tamil version of Eega, is paving way for his earlier movie to dub in Tamil. Well, his blockbuster Chatrapathi is dubbed in Tamil as Chandramouli.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X