Just In
- 3 min ago
అభిజీత్‌తో రిలేషన్‌పై దేత్తడి హారిక క్లారిటీ: అసలు నిజం అదేనంటూ రివీల్ చేసేసింది
- 37 min ago
బోయపాటికి మరో స్టార్ హీరో దొరికేశాడు.. ఒకేసారి రెండు భాషల్లో బిగ్ బడ్జెట్ మూవీ
- 56 min ago
బాగా మిస్ అవుతోందట.. మళ్లీ దుబాయ్‌కి చెక్కేస్తోన్న కీర్తి సురేష్
- 59 min ago
బాలీవుడ్ కోసం తెలుగు సినిమాలను పక్కన పెట్టేశాడట.. టార్గెట్ మామూలుగా లేదు
Don't Miss!
- Sports
టైగర్ పటౌడీని గుర్తుచేశాడు.. రహానేకే టెస్ట్ కెప్టెన్సీ ఇవ్వాలి!! కోహ్లీ ఇక వద్దు!
- Finance
ఈ ఉత్పత్తులపై దిగుమతి సంకాలు భారీగా పెరవగవచ్చు, ఎందుకంటే?
- News
ఏడాదిలో సిద్దిపేటకు రైలు, వెయ్యికోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి హరీశ్ రావు
- Automobiles
సూపర్‌బైక్ రైడర్ని వేధించిన స్థానికులు మరియు పోలీసులు - వీడియో
- Lifestyle
ఈ రాశుల వారు పిల్లల్ని బాగా పెంచుతారట... మీ రాశి కూడా ఉందేమో చూసెయ్యండి...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
కొన్ని సందర్భాల్లో కన్నీళ్ళు మాత్రమే వస్తాయి: జనతా థాంక్స్ మీట్‌లో ఎన్టీఆర్ (ఫోటోస్)
హైదరాబాద్: యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో యలమంచిలి రవిశంకర్, ఎర్నేని నవీన్, సి.వి.మోహన్‌లు నిర్మించిన చిత్రం 'జనతాగ్యారేజ్'. సెప్టెంబర్ 1న సినిమా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ సక్సెస్ సాధించిన నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ ''మాట్లాడటానికి మాటల్లేవ్, అనుభూతులు మాత్రమే మిగిలున్నాయి. కొన్ని సందర్భాల్లో మాటలు మాట్లాడలేం, కన్నీళ్ళు మాత్రమే వస్తాయి, అలాంటి గొప్ప అనుభూతినిచ్చిన దర్శకుడు కొరటాల శివగారికి థాంక్స్ అన్నారు.
సెప్టెంబర్ 1న జనతాగ్యారేజ్ సినిమా విడుదలైంది. సెప్టెంబర్ 2న మా అమ్మనాన్నల పుట్టినరోజు. గత పన్నెండేళ్ళుగా నా తపనను నా తల్లిదండ్రులకు తెలియజేయాలని సంకల్పాన్ని జనతాగ్యారేజ్ రూపంలో కొరటాల శివ కల్పించారు అని ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

ఎప్పటికీ మరిచిపోలేను
నాకు జనతాగ్యారేజ్ రూపంలో ఓ వెలుగు కనపడుతుందని ఆడియో ఫంక్షన్‌లో చెప్పాను. అలా నేను నమ్మిన వెలుగును నాకు అందించిన ఆడియెన్స్‌ను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ విజయాన్ని ఎప్పటికీ మరచిపోలేను. నాకు వచ్చిన అన్నీ విజయాలకంటే ఈ విజయాన్ని నా గుండె దగ్గరగా పెట్టుకుంటాను. అలాగే ఇంకా బాధ్యతతో మరిన్ని మంచి సినిమాలు చేస్తాను అన్నారు ఎన్టీఆర్

నామసులో మాట శివగారికి తెలిసిందేమో
ఇక నేను, సమంత కలిసి చేసిన నాలుగో సినిమా ఇది. మా కాంబినేషన్ బృందావనం తర్వాత వచ్చిన రెండు సినిమాలు అనుకున్నంత సక్సెస్ సాధించలేకపోయాయి. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు ఇందులో సమంత హీరోయిన్ అయితే బావుండేదనిపించింది. నా మనసులో మాట కొరటాల శివగారికి తెలిసిందేమో ఈ సినిమాలో నిజంగానే ఆయన సమంతను హీరోయిన్‌గా తీసుకున్నారు. మా కాంబినేషన్‌లో పెద్ద సక్సెస్ అయిన సినిమాగా నిలిచిపోయిందని తెలిపారు.

జనతాగ్యారేజ్ నటులు, టెక్నీషియన్స్ గురించి
బ్రహ్మాజీ, అజయ్, బెనర్జీ ఈ సినిమాలో ఆరుగుగుర మాకు అందించిన బలాన్ని మరచిపోలేను. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావుగారు, ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్‌గారు అందించిన సపోర్ట్‌ను మరచిపోలేం. రాజీవ్‌కనకాలగారితో చాలా మంచి అనుబంధం ఉంది. ఆయన నటించిన జి.హెచ్.ఎం.సి సీన్ సూపర్బ్‌గా వచ్చింది, చాలా ఏళ్ళ తర్వాత మా కలయికలో వచ్చిన సక్సెస్‌ఫుల్ చిత్రమిది అంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు.

పరిపూర్ణమైన సంగీతం
దర్శకుడు కొరటాల శివగారు సన్నివేశాలను ఎంత అందంగా చూపించినా, ఆ సన్నివేశానికి తగిన విధంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించిన దేవిశ్రీప్రసాద్ సినిమాకు పరిపూర్ణమైన సంగీతాన్ని అందించాడని ఎన్టీఆర్ ప్రశంసించారు.

ఆయన పక్కన నటించే అర్హత లేని వ్యక్తిని
మోహన్‌లాల్‌గారి పక్కన నటించేంత అనుభవం, అర్హత లేని వ్యక్తిని నేను. కానీ ఆయన నన్ను ఓ కొడుకులా, శిష్యుడిలా భావించారు. ఆయనతో ఈ సినిమా సమయంలో చేసిన జర్నీ నాలోని ఎన్నో కొత్త కోణాలను చూశాను అని ఎన్టీఆర్ అన్నారుజ

నిర్మాతలను
నిర్మాతలను నేను జాన్, జానీ, జనార్ధన్ అని పిలుచుకుంటూ ఉంటాను. సినిమా ఇంత బాగా రావడానికి వారే కాణం. వారింకా ఎన్నో గొప్ప చిత్రాలు తీయాలని భావిస్తున్నాను అని ఎన్టీఆర్ తెలిపారు.

ఎక్కువ థ్రిల్ అయింది ఎన్టీఆరే
జనతాగ్యారేజ్ నాకు చాలా స్పెషల్ మూవీ. ఎన్టీఆర్‌ను నేను అన్న అని అంటుంటాను కానీ వయసులో చాలా చిన్న వ్యక్తి. ఈ కథ వినగానే ఎక్కువగా థ్రిల్ అయ్యి మాఅందరికీ కంటే సినిమా కథ చేయడానికి చాలా ఎగ్జయిట్ అయ్యారు అని కొరటాల శివ తెలిపారు. మోహన్‌లాల్‌గారు పాత్రలో ఒదిగిపోయి నటించారు. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ అని కొరటాల శివ తెలిపారు.

ఎన్టీఆర్ దీనికి అన్ని విధాలా అర్హుడు
ఎన్టీఆర్ తో కలిసి ఇప్పటికే మూడు సినిమాలు చేసారు. ఇది నాలుగో సినిమా. మంచి టీం చేసిన ప్రయత్నమిది. అందరికీ మంచే జరుగుతుంది. ఇలాంటి బ్లాక్‌బస్టర్, కలెక్షన్స్‌కు ఎన్టీఆర్ అన్ని విధాలా అర్హుడు అన్నారు సమంత.

ఒక వారంలోనే మొత్తం వసూళ్లు వచ్చాయి
ఒక వారంలోనే బయ్యర్స్ పెట్టిన మొత్తం తిరిగి రావడం అంటే చిన్న విషయం కాదు. చాలా పెద్ద అచీవ్‌మెంట్ చయడానికి కారణమైన ఎన్టీఆర్, మైతీ మూవీ సంస్థకు థాంక్స్ అని దేవిశ్రీ ప్రసాద్ అన్నరు.

థాంక్స్ మీట్
ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కొరటాల శివ, సమంత, దేవిశ్రీప్రసాద్, దిల్‌రాజు, రాజీవ్‌కనకాల, బ్రహ్మాజీ, అజయ్, కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్ డైరెక్టర్ ఎ.యస్.ప్రకాష్, రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.

గ్రాండ్ సక్సెస్
యంగ్ టైగర్ ఎన్టీఆర్, సమంత, కాజల్ హీరో హీరోయిన్లుగా, మోహన్‌లాల్ పధ్రాన పాత్రలో నటించిన చిత్రం 'జనతాగ్యారేజ్'. మైత్రీ మూవీస్ బ్యానర్‌పై కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సి.వి.మోహన్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 1న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయ్యింది.