»   » రొమాంటిక్ కాదు సెక్స్ కామెడీలా ఉందీ : బాబుబాగాబిజీ టీజర్ (వీడియో)

రొమాంటిక్ కాదు సెక్స్ కామెడీలా ఉందీ : బాబుబాగాబిజీ టీజర్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవసరాల శ్రీనివాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ 'బాబు బాగా బిజీ' కుమ్ముడే కుమ్ముడు ఈ మూవీకి ట్యాగ్ లైన్. ఇందులో శ్రీముఖి, మిస్తీ చక్రవర్తి, తేజస్వీ, సుప్రియ హీరోయిన్లు. ఏప్రిల్ 13న బాబు బాగా బిజీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు అవసరాల తెలిపాడు. బాలీవుడ్ మూవీ హంటర్‌కి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాలో శ్రీముఖి, తేజస్వి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

బాలీవుడ్‌ హిట్‌ ఫిల్మ్‌ 'హంటర్‌

బాలీవుడ్‌ హిట్‌ ఫిల్మ్‌ 'హంటర్‌

సునీల్ కశ్యప్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత చెబుతూ, 'బాలీవుడ్‌ హిట్‌ ఫిల్మ్‌ 'హంటర్‌'కి ఈ చిత్రం రీమేక్‌. హిందీ చిత్రాన్ని నిర్మించిన ఫాంటమ్‌ ఫిల్మ్స్‌ సంస్థ తెలుగు చిత్రానికి నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. 'హంటర్‌' సినిమాను చూసినప్పుడు ఎంతో నవ్వుకున్నాను.

కొన్ని సీన్లు చూసిన తర్వాత

రీమేక్‌గా చేస్తే అవసరాల శ్రీనివాస్‌ హీరో పాత్రకు న్యాయం చేయగలరనిపించింది. ఇటీవల కొన్ని సీన్లు చూసిన తర్వాత నా నిర్ణయం సరైదనిపించింది. అవసరాల అద్భుతంగా నటించారు. ఆద్యంతం నవ్విస్తుంది. రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. దర్శకుడు ఈ చిత్రాన్ని బాగా తెరకెక్కించారు. షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌లో ఉంది. త్వరలో ఆడియో విడుదల తేదీని ప్రకటిస్తాం' నిర్మాత చేసిన ప్రకటన తోనే ఈ సినిమా మీద కాస్త ఆసక్తినెలకొంది.

ఓ బూతు కథతో

ఓ బూతు కథతో

క్లాస్ కమేడియన్ గా పేరు తెచ్చుకుని, ఆ తర్వాత దర్శకుడుగా మారి, ఇదిగో ఇప్పుడు హీరోగా సైతం టర్న్ అయిన అవసరాల శ్రీనివాస్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. అయితే ఇప్పుడాయన ఓ బూతు కథతో హీరోగా మన ముందుకు రాబోతున్నారు అన్నప్పుడు ఏమో అనుకున్నాం గానీ ఇప్పుడు ఈ టీజర్ ని చూస్తే అది పక్కా నిజం అని అనిపిస్తుంది.

రొమాంటిక్ సీన్లతో

రొమాంటిక్ సీన్లతో

రకరకాల రొమాంటిక్ సీన్లతో టీజర్ మొత్తం నిండిపోయింది. "ఆర్యూ ఏ వర్జిన్" అన్న మాటకి "అదెప్పుడో పదిహేనేళ్ళ క్రితం" అంటూ అవసరాల చెప్పిన డైలాగ్ తో ముగిసే టీజర్ చూస్తూంటే తెలుగులోనూ రాబోయే రొమాంటిక్ కామెడీలకి ఈ సినిమా నే మొదలు అని చెప్పొచ్చు....

English summary
Srinivas Avasarala is acting in the sex comedy “Babu Baga Busy,” which is the Telugu remake of “Hunterrr.” The film is directed by Naveen Medaram and produced by Abhishek Pictures. A few moments ago, the teaser was released
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu