కమల్ హాసన్ షేర్ చేసిన వీడియో... ఎంత దారుణంగా ఉందో!
జల్లికట్టు ఉద్యమంలో ఆందోళన కారుల హింస ఏమో గానీ.... పోలీసులే స్వయంగా వాహనాలకు నిప్పు పెడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ప్రముఖ టీవీ చానల్ లో ప్రసారం అయిన ఈ వీడియో క్లిప్ ను కమల్ షేర్ చేసారు.
హైదరాబాద్: ఎక్కడైనా సరే అల్లర్లు, గొడవలు జరిగితే పోలీసులు రంగంలోకి దిగి వాటిని అదుపు చేయడం లాంటివి చేస్తుంటారు. కానీ పోలీసులే ఇలాంటి దారుణాలకు పాల్పడితే ఎలా? ఇదే ప్రశ్న వేస్తూ ఓ వీడియో షేర్ చేసారు ప్రముఖ నటుడు కమల్ హాసన్.
తమిళనాడులో జరుగుతున్న 'జల్లికట్టు' ఉద్యమం మొదట శాంతి యువతంగా మొదలైనా... తర్వాత కొన్ని చోట్ల హింసాత్మకంగా మారింది. సోమవారం పలువురు ఆందోళనకారులు పోలీసులపై రాళ్లదాడి చేసినట్లు, పోలీసు వాహనాలు ధ్వంసం చేసినట్లు వార్తలు వచ్చాయి.
అయితే ప్రముఖ నటుడు కమల్ హాసన్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసిన వీడియో ఇపుడు హాట్ టాపిక్ అయింది. జల్లికట్టు ఉద్యమంలో ఆందోళనకారుల హింస ఏమో గానీ.... పోలీసులే స్వయంగా వాహనాలకు నిప్పు పెడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. ప్రముఖ టీవీ చానల్ లో ప్రసారం అయిన ఈ వీడియో క్లిప్ ను కమల్ షేర్ చేసారు.

ఏమిటండీ ఇదంతా.... ఎవరైనా దీనిపై వివరణ ఇస్తారా... అంటూ కమల్ హాసన్ ట్వీట్ చేసారు. ఈ వీడియో ద్వారా కమల్ హాసన్ స్వయంగా ప్రభుత్వాన్ని, పోలీసు యంత్రాంగాన్ని సూటిగా ప్రశ్నించారు.


Click it and Unblock the Notifications











