twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    త్రి ఇడియట్స్ మూల రచయితకు మోసం

    By Srikanya
    |

    అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన 'త్రి ఇడియిట్స్' చిత్రం ఛేతన్ భగత్ రాసిన 'ఫైవ్ పాయింట్ సమ్ వన్' ప్రేరణతో రూపొందించారన్న సంగతి తెలిసిందే. అయితే ఆ విషయాన్ని సినిమా చివరలో ఎండ్ టైటిల్స్ లాస్ట్ లో వేసారు. దాంతో అసలు ఆ విషయాన్ని ప్రేక్షకులు గమనించే అవకాశం కలగటం లేదు. తన కథతో సినిమా ప్రారంభమవుతుందంటూ గతంలో ఛేతన్ భగత్ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పుకొచ్చారు. నేను మొదట ఈ చిత్రం నా నవల ఆధారంగా తీస్తున్నారనగానే చాలా ధ్రిల్ కి గురి అయ్యాను. నే అక్షరాలు తెరపై ఎలా రూపుదిద్దుకోనున్నాయో అన్న ఆసక్తి కలిగింది. అయితే ఇప్పుడాయన మోసం జరిగినట్లుగా ఫీలవుతున్నారు. దర్శక,నిర్మాతలు తాము కేవలం ప్రేరణగా ఆ కథను తీసుకున్నామని చెప్పటం ఆయన్ను బాధ కలిగిస్తోంది.

    రీసెంట్ గా ఆ చిత్ర దర్శకుడు రాజకుమార్ హిర్వాణీ మాట్లాడుతూ...మేము ఈ చిత్రం మెయిన్ ఐడియాను ఛేతన్ భగత్ ఫైవ్ పాయింట్ సమ్ వన్ నుంచి తేసుకున్నారు. అయితే మేము స్క్రిప్టు చేయటం ప్రారంభించాక అనుకోని మార్పులు చోటు చేసుకున్నాయి. కొంత దూరం స్క్రిప్టుతో ప్రయాణించాక మేం రియలైజ్ అయ్యాం. నిజంగా మేము ఆ నవలను ఫాలో కావటం లేదని...పూర్తిగా ఎడాప్ట్ చేయటం లేదని. అయినా సినిమా స్క్రిప్టు వేరు..పుస్తకాన్ని తెరకెక్కించేటప్పుడు మార్పులు అనివార్యంగా వచ్చేస్తుంటాయి అన్నారు. ఇక ఛేతన్ భగత్ ఇదే విషయమై మాట్లాడుతూ...నేను ఈ చిత్రం ఆడుతున్న మల్టీ ఫ్లెక్స్ కు వెళ్ళినప్పుడు అక్కడున్న యువత నా నవల ప్రస్ధావన తెచ్చి మాట్లాడుకోవటం గమనించాను. రచయితగా నాకు అంతకుమించి ఆనందం ఏముంటుంది. నా అభిమానులందరికీ తెలుసు త్రి ఇడియట్స్ చిత్రం నా నవల నుంచి పుట్టిందేనని అంతవరకూ నాకు బెంగలేదు..అంటూ తన అసంతృప్తిని బయిటపడనివ్వకుండా ముగించారు ఆయన. లేకుంటే ఇది మరో కాంట్రావర్శికి దారితీసేది అనేది నిజం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X