»   » సీఎం కేసీఆర్ సినిమా కోసం పాట రాయబోతున్నాడు!

సీఎం కేసీఆర్ సినిమా కోసం పాట రాయబోతున్నాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఓ తెలుగు సినిమా కోసం పాట రాయబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాడు దర్శకుడు అల్లాని శ్రీధర్(కొమురం భీం ఫేం). త్వరలో అల్లాణి శ్రీధర్ ‘బోనాల పోతరాజు' అనే సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కోసం కేసీఆర్‌ను పాట రాయాలని కోరాడు శ్రీధర్.

‘ఆర్ నారాయణ మూర్తి ఈ సినిమా కోసం స్వయంగా స్టోరీ రాసారు. ఆయనే ఇందులో లీడ్ క్యారెక్టర్ చేయబోతున్నారు. ఈ సినిమా కోసం పాట రాయాలని మేము ముఖ్యమంత్రి కేసీఆర్ ను కొన్ని రోజుల క్రితం సంప్రదించాం' అని అల్లాని శ్రీధర్ చెప్పుకొచ్చారు.

 Chief Minister K Chandrasekhar Rao to write lyrics for upcoming Telugu film

ఆర్.నారాయణ మూర్తి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి పాట రాయాలని రిక్వెస్ట్ చేసారు. ఆయన సానుకూలంగా స్పందించారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కేసీఆర్ మంచి కవి కూడా.... అని వారు చెప్పుకొచ్చారు.

English summary
Allani Sridhar, the director of Komaram Bheem, will ask Telangana Chief Minister K. Chandrasekhar Rao to write the lyrics of a song for his upcoming film Bonala Potharaju.
Please Wait while comments are loading...