»   » నాలుగేళ్ల క్రితం ఇదే అడిగాను: ‘చి ల సౌ’ టీజర్‌‌ రిలీజ్ చేసిన రానా, ఫన్నీ కామెంట్!

నాలుగేళ్ల క్రితం ఇదే అడిగాను: ‘చి ల సౌ’ టీజర్‌‌ రిలీజ్ చేసిన రానా, ఫన్నీ కామెంట్!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  ChiLaSow Teaser-Sushanth Groom Version

  సుశాంత్‌, రుహానీ శ‌ర్మ హీరో హీరోయిన్లుగా సిరుని సినీ కార్పొరేష‌న్ బేన‌ర్‌పై రూపొందుతున్న చిత్రం 'చి ల సౌ'. ఈ చిత్రంతో హీరో రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం అవుతున్నారు. తేజ్‌వీర్ నాయుడు స‌మ‌ర్ప‌ణ‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి భరత్ కుమార్ మలశాల, హరి పులిజల, జస్వంత్ నాడిపల్లి నిర్మాత‌లు.

  తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైంది. హీరో రానా దగ్గుబాటి ట్విట్టర్ ద్వారా దీన్ని విడుదల చేశారు. టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. హీరోను పెళ్లి చేసుకోవాలంటూ హీరోపై ఒత్తిడి తెస్తుంటారు. టీజర్ చూసిన అనంతరం రానా స్పందిస్తూ.... నాలుగేళ్ల క్రితం సుశాంత్‌ను కూడా నేను ఇదే విషయం అడిగాను అంటూ ఫన్నీ కామెంట్ చేశారు.

  దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ... "ఈ సినిమా ద్వారా కొత్త సుశాంత్ ని చూస్తారు. రియ‌ల్ లైఫ్‌లో సుశాంత్ ఎలా ఉంటాడో నాకు తెలుసు. ఈ సినిమాలో త‌న‌ను అలాగే చూపిస్తున్నాను. టైటిల్ విని ఇది ట్ర‌యంగిల్ ల‌వ్‌స్టోరీ అనుకోవ‌ద్దు. సినిమా చూస్తే తెలుస్తుంది. నాకు స్టోరీ టెల్లింగ్ అంటే ఇష్టం ఉండ‌టంతో ద‌ర్శ‌కుడిగా మారాను. హీరోగా కూడా సినిమాలు చేస్తాను. ఈ సినిమా త‌ర్వాత హీరోగా ఓ సినిమా చేయ‌బోతున్నాను అన్నారు.

  ఈ చిత్రానికి నిర్మాతలు: భరత్ కుమార్ మలశాల, హరి పులిజల, జస్వంత్ నాడిపల్లి, కెమెరామెన్: ఎం.సుకుమార్, సంగీతం: ప్రశాంత్ విహారి, ఎడిటర్: చోట కె ప్రసాద్, ఎగ్జిక్యూటీవ్ ప్రొడ్యూసర్: హరీష్ కోయిల గుండ్ల, ఆర్ట్ డైరెక్టర్: వినోద్ వర్మ, చీప్ కో డైరెక్టర్: డి. సాయి కృష్ణ, ప్రొడక్షన్ కంట్రోలర్: రవికుమార్ యండమూరి.

  English summary
  ChiLaSow Teaser-Sushanth Groom Version released. The upcoming rom-com entertainer starring Sushanth and Ruhani Sharma as lead pair, marks the debut of actor Rahul Ravindran as director. Sushanth plays a reluctant groom who is pestered by family members to get married. It is touted to be inspired by real-life incident. The film also features Vennela Kishore, Rohini, Anu Hasan among others. Here's the teaser of ChiLaSow.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more