twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మైనర్ బాలిక వివాదం: భానుప్రియ చుట్టూ బిగుస్తున్న కేసు, అరెస్ట్‌కు డిమాండ్!

    |

    నటి భానుప్రియ తన ఇంట్లో మైనర్ బాలికను పనిలో పెట్టుకుని వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. తన ఇంట్లో దొంగతనం జరిగిందంటూ ఆమె ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఇష్యూపై బాలల హక్కుల సంఘాలు సీరియస్ అయింది. ఈ మేరకు వారు బాలిక పక్షాన నిలిచారు. హైదరాబాద్ చెందిన ఓ బాలల హక్కుల సంస్థ జాతీయ మానవ హక్కుల సంఘానికి రాసిన లేఖలో భానుప్రియపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

    భానుప్రియను అరెస్ట్ చేయాలి

    భానుప్రియను అరెస్ట్ చేయాలి

    నిబంధనలకు విరుద్ధంగా భానుప్రియ ఒక మైనర్ బాలికను పనిలో పెట్టుకుందని, చైల్డ్ లేబర్ ప్రివెన్షన్ యాక్ట్, అక్రమ రవాణా, పని ప్రదేశంలో లైంగిక వేధింపుల తదితర అంశాల కింద ఆమెను అరెస్ట్ చేయాలని బాలల హక్కుల సంఘం తన పిటీషన్‌లో పేర్కొన్నారు. వెంటనే తగిన చర్యలు తీసుకునేలా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ డిజిపిలకు ఆదేశాలు జారీచేయాలని కోరారు.

    దొంగతనం చేసినట్లు ఫిర్యాదు

    దొంగతనం చేసినట్లు ఫిర్యాదు

    మైనర్ బాలిక తన తల్లి ప్రభావతితో కలిసి దొంగతనం చేసినట్లు భానుప్రియ సోదరుడు గోపాలకృష్ణన్ పాండీబజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10 సవర్ల బంగారం, 1 లక్ష నగదు, ఐపాడ్, కెమెరా, రెండు గడియాలు తన సోదరి భానుప్రియ ఇంటి నుంచి దొంగిలించ బడ్డాయని అతడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం బాలిక తల్లి నుంచి పోలీసులు రూ. 3 వేలు రికవరీ చేశారు. ప్రభావతి ప్రస్తుతం జుడీషియల్ కస్టడీలో ఉంది.

    <strong>సీనియర్ నటి భానుప్రియ నిజస్వరూపం బట్టబయలు.. 14ఏళ్ల బాలికతో, కేసు నమోదు!</strong>సీనియర్ నటి భానుప్రియ నిజస్వరూపం బట్టబయలు.. 14ఏళ్ల బాలికతో, కేసు నమోదు!

    ఇక్కడ కేసు నమోదు చేయని పోలీసులు

    ఇక్కడ కేసు నమోదు చేయని పోలీసులు

    ఈస్టగోదావరి జిల్లా సామల్‌కోట్‌కు చెందిన ప్రభావతి తన 14 ఏళ్ల కూతురును అక్రమంగా నిర్భంధించి టార్చర్ చేస్తూ లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కేసు తమిళనాడు అధికారుల పరిధిలో ఉండటంతో సామల్ కోట్ పోలీసులు కేసు నమోదు చేయలేదు.

    నా కూతురును లైంగికంగా వేధిస్తున్నారు

    నా కూతురును లైంగికంగా వేధిస్తున్నారు

    భానుప్రియ సోదరుడు వారి ఇంట్లో పని చేస్తున్న తన కూతురును లైంగికంగా వేధిస్తున్నాడని ప్రభావతి ఆరోపిస్తున్నారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ వారు ముందుగా చెప్పినట్లుగా జీతం ఇవ్వడం లేదని, తన కూతురును వెనక్కి పంపడం లేదని తెలిపారు. అయితే భానుప్రియ ఆమె ఆరోపణలను ఖండించారు. ఆ అమ్మాయి తమ ఇంట్లో రూ. 1.5 లక్షల విలువగల వస్తువులు దొంగతనం చేస్తూ పట్టుబడిందని, వాటిని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు.

    English summary
    A child rights organisation on Saturday has written to the National Child Rights Commission demanding action against actor Bhanupriya for allegedly employing a minor at her home.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X