Just In
- 2 min ago
అల్లు అర్జున్ ‘పుష్ప’ రిలీజ్ డేట్ ప్రకటన: అదిరిపోయిన కొత్త పోస్టర్.. ఆ రూమర్లకు కూడా చెక్
- 23 min ago
‘రాధే శ్యామ్’ టీజర్ డేట్ ఫిక్స్: అదిరిపోయే స్పెషల్ డేను లాక్ చేసిన ప్రభాస్
- 35 min ago
ప్రభాస్ 'సలార్' హీరోయిన్ ఫిక్స్.. పుట్టినరోజు కానుకగా అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చిన టీమ్
- 55 min ago
2021 మొత్తం మెగా హీరోలదే హవా.. నెవర్ బిఫోర్ అనేలా బాక్సాఫీస్ పై దండయాత్ర
Don't Miss!
- Finance
Gold prices today: వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు, రూ.7500 తక్కువ
- News
ఇరుకునపడ్డ బీజేపీ.. వాళ్లెవరో తేల్చాల్సిందే.. నేతాజీ జయంతి వేడుకలో ఆ నినాదాలపై ఆర్ఎస్ఎస్ రియాక్షన్
- Sports
ఓ ఇంటివాడైన విజయ్ శంకర్
- Lifestyle
తక్కువ సమయంలో చర్మాన్ని క్లియర్ చేయడానికి ఉపయోగించే ముందు ఇది తెలుసుకోవాలి
- Automobiles
భారత్ బెంజ్ ప్రవేశపెట్టిన 8 కొత్త వాహనాలు, ఇవే.. చూసారా..!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
గోల్డెన్ ఆఫర్ మిస్ చేసుకొన్న మెగా హీరో.. క్యాష్ చేసుకొన్న క్రికెటర్
క్రికెటర్లు సినీ తారలుగా మారడం కొత్తేమీ కాదు. గతంలో సందీప్ పాటిల్ నుంచి మొన్నటి సలీల్ అంకోలా వరకు క్రికెట్‌లో రాణించి వెండి తెర మీద మెరిసారు. ఆ కోవలోనే ఇప్పుడు చిరాగ్ జానీ చేరాడు. హిందీ వినోద పరిశ్రమలో ఇప్పటి వరకు రాణించిన చిరాగ్.. తాజాగా బందోబస్త్ చిత్రంతో దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. అయితే ఈ అవకాశం ముందుగా మెగా హీరో అల్లు శిరీష్‌కు వచ్చిందట.. డేట్స్ కారణంగా తప్పుకోవడంతో ఆ అవకాశం చిరాగ్ జానీకి దక్కింది. వివరాల్లోకి వెళితే..

అల్లు శిరీష్ తప్పుకోవడం
తమిళ, తెలుగు భాషల్లో రూపొందిన బందోబస్త్ (కాప్పాన్) చిత్రంలో ముందుగా ఓ కీలక పాత్ర కోసం అల్లు శీరీష్‌ను ప్రాజెక్టులోకి తీసుకొన్నారు. లండన్ షెడ్యూల్‌కు ముందు శిరీష్ అనూహ్యంగా తప్పుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఏబీసీడీ సినిమా కారణంగా శిరీష్ ఈ నిర్ణయం తీసుకొన్నట్టు అప్పట్లో కథనాలు వచ్చాయి. ఆ పాత్ర కోసం చిరాగ్ జానీని తీసుకోవడం జరిగింది.

చిరాగ్ జానీ ఎవరంటే
ఇక చిరాగ్ జానీ ఎవరంటే.. సౌరాష్ట్రకు చెందిన క్రికెటర్. ప్రస్తుతం సినీ స్టార్‌గా మారాడు. ఇప్పటికే హిందీ సీరియల్స్‌లో నటించిన చిరాగ్ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోకి ప్రవేశించాడు. తాజాగా ఆయన నటించిన బందోబస్త్ చిత్రంలో విలన్‌గా నటించడమే కాకుండా తన మార్క్ నటనను ప్రదర్శించాడు. ప్రముఖ దర్శకుడు కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య, మోహన్ లాల్, సాయేషా సైగల్, ఆర్య నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

ప్రధానిని హతమార్చే పాత్రలో
విలక్షణ నటుడు సూర్య హీరోగా నటించిన బందోబస్త్ చిత్రంలో రంజిత్ అనే ఉగ్రవాదిగా చిరాగ్ జానీ కనిపించాడు. ప్రధాని హత్యకు కుట్రపన్నే ఉగ్రవాదిగా చిరాగ్ ప్రదర్శించిన విలనిజం ఆకట్టుకొనేలా ఉంది. ఎత్తులకు పైఎత్తులుగా సాగే చిత్రంలో తన పాత్రకు చిరాగ్ మంచి మార్కులే సంపాదించుకొన్నాడు. బందోబస్త్ మూవీలో ఫెర్ఫార్మెన్స్ దక్షిణాదిలో మరిన్నీ ఆఫర్లు తన తలుపు తట్టే అవకాశం లేకపోలేదనే మాట వినిపిస్తున్నది.

హిందీ సీరియల్స్‌లో
ఇదిలా ఉండగా, క్రికెట్‌కు వీడ్కోలు పలికి సినిమాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు ఈ యువ క్రికెటర్. రాజేష్ బబ్బర్ దర్శకత్వంలో రూపొందిన హిందీ సీరియల్ 'సప్నే సుహానే లడక్పాన్ కే'లో వైష్ణవి మహంత్‌తో జతకట్టి హిందీ వినోద పరిశ్రమలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత 2016లో 'యాహన్ అమీనా బిక్తీ హై' అనే హిందీ సినిమాతో పెద్ద స్క్రీన్‌పై దర్శనమిచ్చాడు.

క్రికెటర్‌గా
దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర జట్టుకు చిరాగ్ జానీ ప్రాతినిథ్యం వహించారు. ఆల్ రౌండర్‌గా పలు మ్యాచుల్లో ఆకట్టుకొన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మొత్తం 3 మ్యాచ్‌లు ఆడిన అతడు 20 సగటుతో 100 పరుగులు చేశాడు. చిరాగ్ జానీ కుడి చేతివాటం బ్యాట్స్‌మన్ కాకుండా బౌలర్ కూడా. మీడియం పేస్ బౌలింగ్‌తో 4 వికెట్లు పడగొట్టాడు. 8 లిస్ట్ ఏ మ్యాచ్‌లాడిన చిరాగ్ జానీ 430 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 98 నాటౌట్‌గా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు.