నాగశౌర్యకు చిరంజీవి అండ.. కన్ఫర్మ్‌గా కారణం అదేనట
వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో నిర్మాత ఉషా ముల్పూరి చల్ చిత్రం రూపుదిద్దుకొంటున్నది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానుండడం విశేషం.
Recommended Video

ఊహలు గుసగుసలాడే, దిక్కులు చూడకు రామయ్య, జ్యో అచ్చుతానంద చిత్రాలతో దూసుకెళ్తున్నాడు యువ హీరో నాగశౌర్య. తాజాగా ఆయన నటించిన చిత్రం చలో రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. ఇదిలా ఉండగా, ఐరా క్రియేషన్స్ బ్యానర్లో రూపొందుతున్న చిత్రం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొంటున్నది. ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే..

చిరంజీవి ముఖ్య అతిథిగా
వెంకీ కుడుముల దర్శకత్వంలో శంకర ప్రసాద్ ముల్పూరి సమర్పణలో నిర్మాత ఉషా ముల్పూరి చల్ చిత్రం రూపుదిద్దుకొంటున్నది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను జనవరి 25న ఘనంగా చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానుండడం విశేషం.

25న చల్ ప్రీ రిలీజ్ ఈవెంట్
ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భాన్నిపురస్కరించుకొని చిత్ర నిర్మాతలు శంకర్ ప్రసాద్, ఉషా మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ఛలో ఫస్ట్‌లుక్, టీజర్, పాటలను ఇంతగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈనెల 25న ఛలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించనున్నాం.

డిఫరెంట్‌గా ప్లాన్ చేశాం
ఇప్పటివరకు ఎవ్వరూ చేయని విధంగా వినూత్నంగా ప్లాన్ చేశాం. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా రానున్నారు. ఎంతో బిజీగా ఉండి కూడా ఛలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా ఫిబ్రవరి 2న మీ ముందుకు రాబోతున్నాం అని తెలిపారు.

పాటలు ఆకట్టుకొనే విధంగా
మహతి స్వరసాగర్ అందించిన పాటలు అద్భుతంగా ఉన్నాయి. సాయి శ్రీ రామ్ సినిమాటోగ్రఫి ఈ సినిమాకు ప్రధాన బలం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, సాంగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాయి.

ఎనర్జిటిక్ గా నాగశౌర్య పెర్ఫార్మెన్స్
నాగశౌర్య పెర్ఫార్మెన్స్ చాలా కొత్తగా ఎనర్జిటిక్ గా ఉంటుంది. తన కెరీర్లో పర్ ఫెక్ట్ కమర్షియల్ మూవీగా నిలుస్తుందని బలంగా నమ్ముతున్నాను. హీరోయిన్ రష్మిక మందన్న, నాగశౌర్య మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాం అని అన్నారు.

దాసరి స్థానాన్ని భర్తీ
కాగా, టాలీవుడ్‌లో దాసరి నారాయణరావు స్థానాన్ని భర్తీ చేసేందుకు చిరంజీవి పావులు కదుపుతున్నారు. సినిమా ఫంక్షన్లకు హాజరుకావాలని వస్తున్న రిక్వెస్టులకు చిరూ సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ మధ్య ఇండస్ట్రీ కార్యక్రమాలపై సానుకూలంగా స్పందించడం గమనార్హం.


Click it and Unblock the Notifications











