»   » రూ. 30 కోట్లతో చిరంజీవిని టాప్ రేంజికి తీసుకెళ్లిన చరణ్!

రూ. 30 కోట్లతో చిరంజీవిని టాప్ రేంజికి తీసుకెళ్లిన చరణ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అయినా మనం ఇపుడు కొత్తగా చెప్పేది ఏముంది? సినిమా రంగంలో చిరంజీవి టాప్ రేంజే! ఆయన హీరోగా కొనసాగినన్ని రోజులు నెం.1 స్టార్ గా ఓ వెలుగు వెలిగారు. అయితే పాలిటిక్స్ కారణంగా సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చిన చిరంజీవి ఎట్టకేలకు 150వ సినిమా ద్వారా మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను చిరంజీవి తనయుడు, టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా చేపట్టారు. ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ సహ నిర్మాణ సంస్థ వ్యవహరిస్తోంది. వివి వినాయక్ దర్శకత్వం వహించబోతున్న చిరంజీవి 150వ సినిమా త్వరలో ప్రారంభం కాబోతోంది.

తాజగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు చిరంజీవి తీసుకునే రెమ్యూనరేషన్ కూడా ఫిక్స్ అయినట్లు సమాచారం. రామ్ చరణ్, లైకా ప్రొడక్షన్స్ వారు ఈ విషయమై చర్చించి రూ. 30 కోట్లు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ రూ. 15 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చారట. అయితే ఈ విషయమై అఫీషియల్ సమాచారం ఏమీ లేదు.

chiranjeevi

ప్రస్తుతం టాలీవుడ్లో ఫాంలో ఉన్న స్టార్ హీరోల రెమ్యూనరేషన్ భారీగా ఉంది. ఆల్రెడీ మురుగదాస్ సినిమాకు మహేష్ బాబు రూ. 25 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్. చిరంజీవి వీరికి ఏ మాత్రం తీసిపోకూడదనే ఉద్దేశ్యంతోనే ఇంత భారీ అమౌంట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి చిరంజీవి రెమ్యూనరేషనే ఈ రేంజిలో ఉందంటే... సినిమా నిర్మాణ ఖర్చు ఎంత ఉంటుందో? చూడాలి.

చిరంజీవి రీ ఎంట్రీ సినిమా కావడంతో చాలా ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేస్తున్నారు. ఎప్పుడూ తెలుగులో కనిపించే రోటీన్ విలన్ కాకుండా డిపరెంటుగా ప్లాన్ చేసారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

చిరంజీవి ఇటీవల స్వయంగా వివేక్ ఒబెరాయ్ కి ఫోన్ చేసి ఈ విషయమై అడిగారని, ఏకంగా చిరంజీవి నుండి కాల్ రావడంతో వివేక్ ఒబెరాయ్ ఫుల్ ఎగ్జైట్మెంటులో ఉన్నారని, వెంటనే ఒకే చెప్పారని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయమై అఫీషియల్ ప్రకటన రానుంది.

English summary
Apparently the remuneration of Megastar Chiranjeevi became a huge topic now, with Ram Charan and Lyca Productions teaming up to producer iconic 150th film. A report has surfaced other day that Chiranjeevi is being paid 30 crores.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu