»   » చిరు 150వ సినిమా : కాపీ వివాదంపై గోపీ మోహన్...

చిరు 150వ సినిమా : కాపీ వివాదంపై గోపీ మోహన్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవి 150 వ సినిమా కోసం బివిఎస్ రవి - గోపి మోహన్ కలిసి అందించిన కథ కాపీ అంటూ మీడియాలో వస్తున్న సంగతి తెలిసిందే. కథలో ఎంటర్టైన్మెంట్ ట్రీట్ మెంట్ కోసం గోపీమోహన్ కి చెప్తే... ఆయన ద్వారా బి.విఎస్ రవి ఆ కథ వినటం జరిగిందని, అలా కథని ఎత్తేసారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలో గోపీ మోహన్ ..స్పందించారు.

గోపి మోహన్ స్పందిస్తూ ‘నేను బివిఎస్ రవితో కలిసి షేర్ చేసుకున్న కథని కాపీ అని పుకార్లు వస్తున్నాయి. వాటిల్లో అస్సలు నిజం లేదు. అలా వాదించే ఏ రైటర్ అయినా వచ్చి ధైర్యంగా రైటర్స్ యూనియన్ లో ఈ విషయాన్నీ పరిష్కరించుకోవచ్చని' గోపి మోహన్ తెలిపారు.

యుఎస్ కి చెందిన వాసు దేవ్ వర్మ అనే రైటర్ చిరుకి చెప్పిన 150వ సినిమా కథ తనది అని రైటర్స్ పైన దావా చేసారు. కానీ ఈ విషయం పై స్పందించిన బివిఎస్ రవి తాము ఎవరి కథని కాపీ కొట్టలేదని అన్నారు.

ఇక చిత్రం విషయానికి వస్తే..

‘‘అవును. ఇది నిజం. చివరకు నాన్న నిర్ణయించుకున్నారు. మెగాస్టార్‌ 150వ చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్‌. ఎగ్జైటెడ్‌!!!'' అని తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలిపారు రామ్‌చరణ్‌. అలా మొత్తానికి అధికారికంగా రామ్‌చరణ్‌ ఈ సినిమా విషయాన్ని ధృవీకరించారు. ఈ చిత్రానికి దర్శకుడు పూరి జగన్నాథ్, కథ ..బి.వియస్ రవి.

అంతవరకూ బాగానే ఉంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం కథ తనదే నంటూ ఓ యువకుడు మీడియా ముందుకు వచ్చారు. అంతేకాదు..ఆ కథను ప్రభాస్ కోసం డవలప్ చేసిందని, ఒక్కడుగు టైటిల్ తో కృష్ణం రాజు దర్శకత్వంలో తెరకెక్కించాలనుకున్నామని చెప్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే....

Chiranjeevi 150th film story a stolen one?

యుఎస్ కు చెందిన ...రచయిత దేవ్ వర్మ...తన కథను...ఎపి రైటర్స్ అసోశియేషన్ లో రిజిస్టర్ చేసానని చెప్తున్నారు. దేవ్ వర్మ మాట్లాడుతూ.... " నేను 2011 లో ఈ కథను రాయటం మొదలెట్టాను. అంతేకాదు... కృష్ణం రాజు గారికి ఈ కథను చెప్పటం జరిగింది. ఆయన చాలా ఇష్టపడి..వెంటనే దాన్ని నిర్మించటానికి ముందుకు వచ్చారు. ప్రభాస్ అందులో నటించటానికి ఆసక్తి చూపారు. కానీ ...కొన్ని కారణాలు వల్ల మొదట అనుకున్నది వర్కవుట్ కాలేదు. తర్వాత...తమిళ,తెలుగు భాషల్లో దర్శకుడు ఎఆర్.మురగదాస్ ఆధ్వర్యంలో ముందుకు వెల్దామనుకున్నాం... అని చెప్పుకొచ్చారు.

ఇక ఈ కథ ..ఎలా రచయిత బి.వియస్ రవి దగ్గర ఉన్న కథ , మీ కథ ఒకటే అని ఎలా చెప్పగలరు ..మీకు ఎలా తెలుసు ...అనేదానికి సమాధానం చెప్తూ... నటుడు సుబ్బరాజు నాకు మంచి మిత్రుడు.. క్రితం నవంబర్ లో నేను ఇండియాలో ఉన్నప్పుడు ఆయన్ను కలిసాను. అదే సమయంలో సుబ్బరాజు ని కలవటానికి రచయిత రవి వచ్చారు. అలా ఆ సమయంలో క్లుప్తంగా చిరు కథ ఇది అని స్టోరీ లైన్ చెప్పటం జరిగింది. అంతేకాదు ఒక్క అడుగు టైటిల్ ని పెట్టాలనుకుంటున్నట్లు రవి చెప్పారని అన్నారు. దాంతో ఆ కథ విని షాక్ అయ్యానని చెప్పారు.

"అయితే నేను ఇమ్మిడియట్ గా రియాక్టు కాలేదు..తర్వాత అతనితో నెగోషియేట్ చేయటానికి ప్రయత్నించారు. అయితే తన కథ...మా కథ ఒకటి కాదని అతను చెప్తూ వస్తున్నారు. అంతేకాదు ఓ సమయంలో అతను నా మీద తీవ్రంగా కోప్పడ్డారు " అని చెప్పారు.

ఈ విషయమై బి.వియస్ రవి మాట్లాడుతూ..., "నేను అతనికి చెప్పాను...నా స్క్రిప్టుకు దానికి పోలీక లేదు అని...ఇంతకు మించి నాకు ఈ విషయమై మాట్లాడటం ఇష్టం లేదు " అని అన్నారు.

ఇక రామ్ చరణ్‌ తొలి చిత్రం ‘చిరుత'కు దర్శకుడు జగన్నాథే కావడం గమనించదగ్గ అంశం. నిజానికి కొద్ది రోజుల క్రితమే బండ్ల గణేశ్‌ ఈ విషయాన్ని పరోక్షంగా ట్విట్టర్‌ ద్వారా తెలియజేసిన సంగతి తెలిసిందే. మరోవైపు పూరి కూడా తన ఉద్వేగాన్ని బయటపెట్టకుండా ఉండలేకపోయారు. ‘‘ఒకప్పుడు చిరంజీవి సినిమాకి థియేటర్‌ దగ్గర డెకరేషన్లు చేసేవాడికి ఏం తెలుసు, ఏదో ఒకరోజు వాడే ఆయన 150వ సినిమా డైరెక్ట్‌ చేస్తాడని. ప్లీజ్‌ అతణ్ణి ఆశీర్వదించండి'' అని ట్వీట్‌ చేశారు.

ఇక ఈ చిత్రానికి కథను అందిస్తున్న బీవీఎస్‌ రవి ‘‘మెగాస్టార్‌ నుంచి అంగీకారం పొందడం ఎంతో ఉత్తేజంగా, ఉద్వేగంగా ఉంది'' అని తెలిపారు. ఈ సినిమా షూటింగ్‌ చిరంజీవి జన్మదినమైన ఆగస్ట్‌ 22న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఆ రోజు ఆయన షష్ఠి పూర్తి కావడం కూడా విశేషం. చిరంజీవి హీరోగా నటించిన చివరి సినిమా ‘శంకర్‌దాదా జిందాబాద్‌' 2007 జూలైలో విడుదలైంది. అంటే అది వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత మరోసారి హీరోగా ఆయన కెమెరా ముందుకు రాబోతున్నారన్నారు.

English summary
Gopi Mohan tweetd "A gossip news is circulating that i shared someone's story with BvsRavi.It's a false news.Whoever it is,they can solve with Writers union"
Please Wait while comments are loading...