twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి బర్త్ డే విషాదం: ఈవెంట్ మేనేజర్ దుర్మరణం

    By Srikanya
    |

    హైదరాబాద్ : శనివారం, ఆదివారం పూర్తిగా చిరంజీవి పుట్టిన రోజు వేడుకలే ఎక్కడ విన్నా... ఏం చూసినా అన్నట్లు సాగాయి. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలు ఈ వేడకకు హాజరయ్యి ఆయనకు విషెష్ తెలిపారు. అయితే ఇలాంటి ఆనందకర సందర్భంలో ఓ దుర్మరణం అందరినీ బాధపెట్టింది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    ఇంత ఘనంగా జరిగిన ఈ వేడకకు ఈవెంట్ మేనేజర్ చేసిన వ్యక్తి ఈవెంట్ ముగియకుండానే విషాదకరంగా దుర్మరణం చెందారు. అతను పేరు మిహర్ చద్దా. 21 సంవత్సరాల ఈ కుర్రాడు ఇంత పెద్ద ఈవెంట్ ని మేనేజ్ చెయ్యగల స్దాయికు ఎదిగాడు. ఈ పుట్టిన రోజు వేడుకలను కూడా తనదైన శైలిలో డిజైన్ చేసి అందరి చేతా శభాష్ అనిపించుకున్నాడు.

    అందులో భాగంగానే శనివారం రాత్రి హోటల్ లో ఈ ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ బయిటకు వెళ్లిన మిహిర్ ..హోటల్ కు సమీపంలోనే బంజారాహిల్స్ సినీ మాక్స్ వద్ద యాక్సిడెంట్ కు గురి అయ్యి మరణించాడు. తన స్పోర్ట్స్ బైక్ లో అతి వేగంగా వెళ్లిన అతు మరో మహిళ మృతికు కూడా కారణమయ్యాడు.

    సినీ మ్యాక్స్ సమీపంలో రోడ్డు దాటుకుంటున్న ఒక మహిళను మిహర్ బైక్ వెళ్లి ఢీ కొట్టింది. అతి వేగంగా వస్తూండటంతో ప్రమాద తీవ్రత పెరిగి, ఇద్దరూ దుర్మరణం పొందే పరిస్ధితులు ఏర్పడ్డాయి. ఓ వైపు పార్టీ జరుగుతూండగానే ఈ మరణం జరిగిందని సమాచారం.

    Chiranjeevi 60th B'Day Party Event Manager died

    పుట్టిన రోజు విశేషాలకు వస్తే...

    చిరంజీవి 60వ పుట్టినరోజు వేడుకలు శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగాయి. చిరు రీ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకొన్న సమయంలో తోటి తారలంతా వచ్చి ఆయన్ని పరిశ్రమకి స్వాగతం పలికినట్టుగా మెగా సంబరం జరిగింది. చిరు పుట్టినరోజుని పురస్కరించుకొని ఓ హోటల్‌లో జరిగిన వేడుకకి వివిధ సినీ పరిశ్రమలకి చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ నేతలు కూడా హాజరయ్యారు.

    అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో తారలంతా తళుక్కున మెరిశారు. వేడుకకి వచ్చే అతిథుల్ని ఆహ్వానించేందుకు చిరంజీవితో పాటు రామ్‌చరణ్‌, అల్లు అర్జున్‌ ముందుగానే హోటల్‌కి చేరుకొన్నారు. రాత్రి 8 గంటలకు వేడుక మొదలైంది. తన మిత్రులతో కలసి పవన్‌ కల్యాణ్‌ స్వయంగా కారు నడుపుకొంటూ హోటల్‌కి చేరుకొన్నారు. నేరుగా చిరంజీవి దగ్గరికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు.

    అంతకుముందే చిరంజీవి ఇంటికి వెళ్లి పవన్‌ శుభాకాంక్షలు చెప్పారు. కార్యక్రమానికి వచ్చిన సల్మాన్‌ ఖాన్‌కు రామ్‌చరణ్‌ సాదరంగా స్వాగతం పలికాడు. ఈ వేడుకకి బాలకృష్ణ, మోహన్‌బాబు, వెంకటేష్‌, నాగార్జున, కమల్‌హాసన్‌, శత్రుఘ్నసిన్హా, అంబరీష్‌, శ్రీదేవి, బోనీ కపూర్‌, అభిషేక్‌ బచ్చన్‌, జయా బచ్చన్‌, వివేక్‌ ఒబెరాయ్‌, కుష్బూ, సూర్య, కె.విశ్వనాథ్‌, కె.రాఘవేంద్రరావు, సుహాసిని, సుమలత, లిజి, రాధ, అల్లు అరవింద్‌ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు.

    రాజకీయ ప్రముఖుల్లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో పాటు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్‌, గంటా శ్రీనివాసరావు, తెలంగాణ మంత్రి కె.తారకరామారావు తదితరులు హాజరయ్యారు.

    English summary
    Mihir Chadha... An event manager who is over-seeing the arrangements of Chiranjeevi's 60th birthday bash at Park Hyatt died on Friday night, just a day before the grand celebrations.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X