twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పనికంటే ప్రాణాలు ముఖ్యం.. నా పరిస్థితి దారుణంగా ఉంది: లాక్‌డౌన్‌పై చిరంజీవి

    |

    కరోనావైరస్ కారణంగా షూటింగులు నిలిచిపోవడంతో ఆర్థిక ఇబ్బంది పడుతున్న సినీ కార్మికుల జీవితాలపై మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ కాలంలో షూటింగులు లేక జీవనోపాధి కరువైన రోజువారీ వేతన కార్మికులను ఆదుకొనేందుకు చిరంజీవి నేతృత్వంలో కరోనా క్రైసిస్ చారిటీ (సీసీసీ)ని ఏర్పాటు చేసి సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్ సడలింపుల తర్వాత కూడా షూటింగులు ప్రారంభించడానికి అడ్డంకులు ఎదురవుతున్న నేపథ్యంలో మరోసారి సినీ కార్మికులను ఆదుకోవడానికి మరోసారి సినీ పరిశ్రమ సిద్దమవుతున్నది. ఈ క్రమంలో మెగాస్టార్ స్పందిస్తూ..

    రెండో విడుత సహాయం అందించాలని

    రెండో విడుత సహాయం అందించాలని

    పరిశ్రమలో అవస్థలు పడుతున్న సినీ కార్మికుల కుటుంబాలకు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌ పంపిణీ చేయాల్సిన ప‌రిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా ఊహించినట్టుగా షూటింగులు మొద‌లుకాకపోవడంతో వేతన కార్మికులేవరికీ ప‌ని లభించడం లేదు. పరిశ్రమలో ఇంకా లాక్‌డౌన్ ప‌రిస్థితులే కొన‌సాగుతున్నాయి. అందుకే అంద‌రికీ నిత్యావ‌స‌ర స‌రుకులు ఇవ్వాల‌ని సీసీసీ క‌మిటీలో నిర్ణ‌యించాం అని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు.

    నేరుగా ఇంటికే పంపిణీ

    నేరుగా ఇంటికే పంపిణీ

    తెలంగాణ, హైదరాబాద్‌లో కరోనా పరిస్థితులు అదుపు తప్పడంతో అంద‌రూ ఇళ్ల‌కే ప‌రిమిత‌మై ఎవరూ బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. కాబ‌ట్టి సీసీసీ వాలంటీర్ల ద్వారా నేరుగా సినీ కార్మికుల కుటుంబాలకు చెందిన ఇళ్ల‌కే వ‌స్తువుల‌ను పంపిణీ చేశాం. క్వాలిటీ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. నేను స్వ‌యంగా సరుకుల నాణ్యతను పరిశీలించడమే కాకుండా రుచి కూడా చూశాను. సరుకులను చాలా పొదుపుగా వాడుకోవాలని సూచిస్తున్నాం అని చిరంజీవి అన్నారు.

    పని కంటే ప్రాణాలు ముఖ్యం

    పని కంటే ప్రాణాలు ముఖ్యం

    షూటింగులు ఎప్పుడు ప్రారంభించాలనే విషయంపై క్లారిటీ లేదు. అందరం కలిసి చర్చించుకొన్న తర్వాత అధికారికంగా ఓ ప్రకటన చేస్తాం. షూటింగులు లేకుండా నాకు కూడా విసుగు పుడుతున్నది. ఇంట్లో ఉండలేక బోర్ కొడుతున్నది. నాకే ఇలా ఉండే అందరి పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోగలను. త్వరలోనే కరోనా మహమ్మారిని అధిగమిద్దాం. పని ఎంత ముఖ్యమో ప్రాణాలు అంతకంటే ముఖ్యం. కాబట్టి ఈ పరిస్థితుల్లో కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్త వహించండి అంటూ చిరంజీవి సూచించారు.

    Recommended Video

    Ram Charan & Upasana Celebrates 5 Years Of Wedding
    అర్హులైన వారికే సహాయం

    అర్హులైన వారికే సహాయం

    నిత్యావసర వస్తువులు అవసరం ఉన్న కార్మికులకే రెండో విడుత అందించాలని నిర్ణయించాం. ఆర్థికంగా నిలకడగా ఉన్న కార్మికులకు గుర్తించి వారి అనుమతితో కొందరికి ఇవ్వకూడదని కమిటీ తీసుకొన్నది. దీని వల్ల అవసరం ఉన్న వారికే లబ్ది చేకూరేలా చర్యలు తీసుకొంటున్నాం. అవసరమైతే మూడో విడుత కూడా నిత్యవసర వస్తువులను అందించాలని కూడా కమిటి అభిప్రాయపడింది. నిత్యవసర సరుకులు అవసరం లేని వారు తీసుకోవద్దని అవసరం ఉన్నవారు మాత్రమే తీసుకుంటే బాగుంటుందని సిసిసి కమిటీ విజ్ఞప్తి చేస్తుందని చెప్పారు.

    English summary
    Megastar Chiranjeevi have assured to help daily wage workers, who is suffering in coronavirus lockdown. He has given clarity about CCC help to daily wage workers in Film Industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X