»   » నాకు పోటీ అనేదే లేదు: ఖైదీ, శాతకర్ణి వార్... చిరంజీవి స్పదించారు!

నాకు పోటీ అనేదే లేదు: ఖైదీ, శాతకర్ణి వార్... చిరంజీవి స్పదించారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా పరిశ్రమలో ఈ మధ్య కాలంలో ఎన్నడూ కనిపించని వైబ్రేషన్స్, ఓ ఆసక్తిక, ఓ ఉత్కంఠ ఈ సారి సంక్రాంతికి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఓ వైపు మెగాస్టార్ కెరీర్లో 150వ చిత్రం, పదేళ్ల తర్వాత సినీ రంగంలోకి రీ ఎంట్రీ ఇస్తున్న 'ఖైదీ నెం 150' విడుదలవుతుండటం, మరో వైపు బాలయ్య తన కెరీర్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన 100వ సినిమా, పైగా తెలుగు వారి ఖ్యాతిని చాటి చెప్పే చారిత్రక చిత్రం 'గౌతమీ పుత్ర శాతకర్ణి' విడుదలవుతుండటం.

ఈ పోటీపై ఇప్పటి వరకు పలువురు స్టార్స్, ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు, ఆ సినిమాకు సంబంధించిన వారు స్పందించారు. ఈ రెండు చిత్రాల దర్శకులైన వివి వినాయక్, క్రిష్ కూడా మాట్లాడారు. అయితే ఈ రెండు చిత్రాల హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.


తాజాగా.... ఓ ప్రముఖ తెలుగు పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి ఈ పోటీపై స్పందించారు.


నాకు పోటీ అనేది లేనే లేదు

నాకు పోటీ అనేది లేనే లేదు

ఖైదీ, శాతకర్ణి పోటీపై చిరంజీవి స్పందిస్తూ... పోటీ అనేది నాకు లేనే లేదు. నా 150వ సినిమా అప్పుడు బాలకృష్ణ 100వ సినిమా 'శాతకర్ణి' కుదరడం అనేది కాకతాళీయం. పోటీ పడి మేం చేసింది కాదు. రిలీజ్‌ టైమ్‌ ఒకేసారి కావడంతో మీడియా క్రియేట్‌ చేసిన పోటీ ఇది అని చిరంజీవి చెప్పుకొచ్చారు.


బాలయ్యతో ఈక్వెషన్

బాలయ్యతో ఈక్వెషన్

మా ఇద్దరి మధ్య మంచి ఈక్వెషన్స్ ఉన్నాయి. 'శాతకర్ణి' సినిమా ఓపెనింగ్‌కి నేను వెళ్లాను. నేను కెమెరా స్విచాన్‌ చేశాను. నూరవ సినిమాగా ఈ కథాంశాన్ని ఎన్నుకోవడమే మొదటి సక్సెస్, ఇలాంటి సినిమాలు ఆడాలని నిండు మనసుతో విష్‌ చేశాను. క్రిష్‌ 'కంచె' చూసి, నేను ఇంటికి పిలిచి, అభినందించాను. క్రిష్‌ టాలెంటెడ్‌. మిత్రుడు బాలకృష్ణ సినిమా సూపర్‌ హిట్‌ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సంక్రాంతికి వచ్చే అన్నీ ఆడాలి అని చిరంజీవి చెప్పుకొచ్చారు.


రీఎంట్రీపై

రీఎంట్రీపై

తొమ్మిదిన్నరేళ్ల విరామం తర్వాత నేను చేసిన రీ-ఎంట్రీ సినిమా. అభిమానులను ఎంతవరకూ వాళ్లను ఈ సినిమా అలరిస్తుందనే మీమాంస, తర్జన భర్జనలు మాకున్నాయి. నేను, చరణ్, వినాయక్, గౌతంరాజు కలిసి సినిమా చూసాం, బాగా వచ్చింది, మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నామని చిరంజీవి చెప్పుకొచ్చారు.


ఇందులో నాది బెస్ట్ లుక్

ఇందులో నాది బెస్ట్ లుక్

'స్టాలిన్‌', 'శంకర్‌దాదా జిందాబాద్‌'.. ఇలానే నేను చేసిన చివరి మూడు నాలుగు సినిమాల కంటే ఈ సినిమాలో నా లుక్‌ చాలా బాగుంది. ఫస్ట్‌డే మేకప్‌ వేసుకుని లొకేషన్‌కి వెళ్లగానే, వినాయక్‌ 'అన్నయ్యా... 'చూడాలని ఉంది'లో చిరంజీవిలా ఉన్నారు. ఫిఫ్టీ పర్సెంట్‌ హిట్‌ ఇక్కడే కొట్టేశాం' అన్నాడని చిరంజీవి గుర్తు చేసుకున్నారు.


English summary
Chiranjeevi about Khaidi no 150, Gautamiputra Satakarni release war. Check out details.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu