twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శభాష్ లారెన్స్.. 200 మందికి విద్య... 150 మందికి హార్ట్ సర్జరీలు.. 60 మంది దత్తత.. చిరంజీవి ఎమోషనల్

    |

    Recommended Video

    Chiranjeevi Shared His Feelings In A Video About Raghava Lawrence || Filmibeat Telugu

    ఇంతితై వటుడింతై అన్నట్లుగా లారెన్స్ రాఘవ దక్షిణాది సినిమా పరిశ్రమలో ఎంతో ఎత్తుకు ఎదిగాడు. గ్రూప్ డ్యాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించి కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. తాజాగా ఆయన రూపొందించిన చిత్రం కాంచన 3. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్బంగా లారెన్స్‌ను ప్రశంసిస్తూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో సందేశాన్ని పంపారు. ఆ వీడియోలో చిరంజీవి ఏం చెప్పారంటే....

    ముఠామేస్త్రీ మూవీ షూటింగ్‌లో

    ముఠామేస్త్రీ మూవీ షూటింగ్‌లో

    లారెన్స్ రాఘవతో నాకు రెండున్నర దశాబ్దాలుగా పరిచయం ఉంది. ముఠా మేస్త్రీ పాట షూటింగ్ సందర్భంగా గ్రూప్ డ్యాన్సర్‌గా మూడు వరుసలో మూమెంట్స్ చేస్తున్న లారెన్స్ ప్రతిభను గుర్తించాను. ఆ తర్వాత ఆంటీ అనే సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫి చేశాడు. చిన్న సినిమా అయినప్పటికీ.. ఆ పాట నాకు ఎందుకో బాగా గుర్తుండిపోయింది.

    హిట్లర్ సినిమాలో పాటకు అవకాశం

    హిట్లర్ సినిమాలో పాటకు అవకాశం

    1995లో హిట్లర్ సినిమా చేస్తుంటే లారెన్స్‌తో పాట చేయించుకోవాలని అనుకొన్నాను. ఆ సినిమాలో హబీబీ.. హబీబీ అనే పాటను లారెన్స్ కంపోజ్ చేశారు. నాపై, రంభపై చిత్రీకరించిన పాట ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకొన్నదో మాటల్లో చెప్పలేం. ఈ రోజుకు ఆ స్టెప్పులు గుర్తుండిపోయేలా చేసి.. లారెన్స్ శభాష్ అనిపించుకొన్నాడు.

     లారెన్స్ గొప్ప కొరియోగ్రాఫర్‌గా

    లారెన్స్ గొప్ప కొరియోగ్రాఫర్‌గా

    అలా ఎన్నో పాటలకు మంచి కోరియోగ్రఫిని అందిస్తూ టాలీవుడ్‌లో గొప్ప కొరియోగ్రాఫర్ అనిపించుకొన్నాడు. ఆ తర్వాత నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్వయంకృషితో ఎదిగాడు. ఎవరైనా స్వయంకృషితో ఎదిగితే వారంతా నాకు అభిమానులే. అలాంటి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఓ తమ్ముడిగా చాలా ఇష్టపడుతాను అని చిరంజీవి అన్నారు.

     కాంచన 3 ఘనవిజయం సాధిస్తుంది

    కాంచన 3 ఘనవిజయం సాధిస్తుంది

    ప్రస్తుతం కాంచన సినిమాకు సీక్వెల్‌గా కాంచన 3 వస్తున్నది. గత సినిమాల మాదిరిగానే కాంచన 3 మూవీ ఘన విజయం సాధిస్తుందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. లారెన్స్‌కు హృదయపూర్వక అభినందనలు. లారెన్స్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని భావిస్తున్నాను.

    50 మందికి హార్ట్ సర్జరీలు చేయించా

    50 మందికి హార్ట్ సర్జరీలు చేయించా

    సినిమానే కాకుండా లారెన్స్ స్వచ్ఛంద సహాయంలో ముందున్నాడు. తన లారెన్స్ చారిటబుల్ ట్రస్టు బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటికే ట్రస్టు ద్వారా చెన్నైలో 200 మందికి విద్య సదుపాయాలు అందిస్తున్నారు. 150 మందికి హార్ట్ సర్జరీలు చేయించారు. 60 మందిని దత్తత తీసుకొన్నాడు. ట్రస్ట్ ద్వారా అద్బుతమైన సేవలు అందిస్తున్నారు.

    చిరంజీవి రూ.10 లక్షల విరాళం

    హైదరాబాద్‌లో కూడా ట్రస్టును ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకొన్నందుకు లారెన్స్‌ను అభినందిస్తున్నాను. లారెన్స్ ట్రస్టుకు నా వంతుగా రూ.10 లక్షల విరాళం అందిస్తున్నాను. లారెన్స్‌కు ఉన్నంతలో స్వచ్ఛంద సేవ, కళా సేవ చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నాను. స్వయంకృషితో రాణిస్తూ పలువురికి స్ఫూర్తి ప్రదాతగా నిలువడాన్ని అభినందిస్తున్నాను అని చిరంజీవి అన్నారు.

    English summary
    Raghava Lawrence's latest is Kanchana 3. This movie's pre release function held in hyderabad. In this functions, Megastar Chiranjeevi appreciated Lawrence. Chiranjeevi shared his feelings in a video.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X