twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఉపాసన ట్వీట్ ఎఫెక్టా..? ప్రధాని నుంచి మెగాస్టార్‌కు పిలుపు.. వైరల్ అవుతోన్న వార్త

    |

    తొలి స్వతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నట విశ్వరూపాన్ని చూపారు. తన సినీ కెరీర్ మైలురాయిగా నిలిచిపోయిన చిత్రంగా సైరా పేరు తెచ్చుకుంది. ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రముఖ రాజకీయ నాయకులకు కూడా చూపించారు.

    చిత్రాన్ని వీక్షించిన తమిళిసై, వెంకయ్య నాయుడు

    చిత్రాన్ని వీక్షించిన తమిళిసై, వెంకయ్య నాయుడు

    తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడులను కలిసి సైరా చిత్రాన్ని వీక్షించవలసింది చిరంజీవి కోరాడు. దీంతో చిత్రాన్ని చూసిన వీరిద్దరు ప్రశంసలు కురిపించారు. ఎంతో అద్భుతంగా చిత్రాన్ని నిర్మించినందుకు నిర్మాతను, దర్శకుడిని కొనియాడారు. ప్రతీ ఒక్కరూ తప్పక చూడవలసిన చిత్రమని పేర్కొన్నారు.

    బాలీవుడ్‌తో ప్రధాని భేటీ

    బాలీవుడ్‌తో ప్రధాని భేటీ

    ఇటీవలె మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకల్లో భాగంగా సినీ ఇండస్ట్రీ సమాజంపై ప్రభావం అనే కాన్సెప్ట్‌లో భాగంగా ప్రధాని నరేంద్రమోదీ బాలీవుడ్‌ ప్రముఖులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మెగా కోడలు ఉపాసన తన అసంతృప్తిని తెలిపింది. సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం ఉత్తరాది వారే కాదని చెప్పుకొచ్చింది.

    వైరల్ అయిన ఉపాసన పోస్ట్..

    వైరల్ అయిన ఉపాసన పోస్ట్..

    ప్రధాని చేపట్టిన ఈ కార్యక్రమంలో అధిక శాతం మంది బాలీవుడ్ ప్రముఖులే ఉండటంతో ఉపాసన ఓ పోస్ట్ చేసింది. సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదు దక్షిణాదిని మీరు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కామెంట్ చేసింది. ఈ పోస్ట్‌పై మెగాభిమానులు మద్దతు ప్రకటించగా.. బీజేపీ నాయకులు మాత్రం ఫైర్ అయ్యారు.

    ప్రధాని నుంచి మెగాస్టార్‌కు పిలుపు..

    ప్రధాని నుంచి మెగాస్టార్‌కు పిలుపు..

    తాజాగా ఓ ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. తమకు ప్రధాని నుంచి పిలుపు వచ్చిందని, త్వరలోనే వెళ్లి కలువబోతోన్నామని స్పష్టం చేశాడు. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇది ఉపాసన ట్వీట్ ఎఫెక్టా? అంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. అయితే ఉపరాష్ట్రపతిని కలిసిన సమయంలోనే ప్రధాని అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించినా.. బిజీగా ఉండటం వల్ల కుదరలేదని తెలుస్తోంది.

    English summary
    Chiranjeevi And Ram Charan Will Meet Narendra Modi. Upasana Questioned Narendra Modi On Meeting With Bollywood By Neglecting South Industry.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X