»   » 'లోఫర్' ప్రిప్యూ షో పై చిరంజీవి కామెంట్

'లోఫర్' ప్రిప్యూ షో పై చిరంజీవి కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : లోఫర్ సినిమా ప్రిప్యూ షో ని నిన్న బుధవారం రాత్రి మెగాస్టార్ చిరంజీవి, హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో చూసారు. సినిమా చూసిన అనంతరం వరుణ్ తేజ్ నటనని మెచ్చుకుంటూ, ఇట్స్ ఎ విన్నర్ అని కితాబిచ్చారు. వరుణ్ తేజ్ కి ఈ మాటలు చాలా శక్తి వంతంగా అనిపించాయి.

కంచె చిత్రంతో తనలోని నటుడుని ఆవిష్కరించుకుని క్లాస్ ఆడియన్స్ దగ్గరైన వరుణ్ తేజ ఈసారి మాస్ అవతారంలో దిగుతున్నాడు. తల్లి సెంటిమెంట్ తో పూర్తి స్దాయి ఎంటర్టైన్మెంట్ గా ఈ సినిమా రూపొందింది. జ్యోతిలక్ష్మితో వెనక బడ్డ పూరి ఈ సినిమాని తనదైన ట్రేడ్ మార్క్ డైలాగులతో రూపొందించి తిరిగి ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేసాడని తెలుస్తోంది.


Chiranjeevi appreciates Loafer

పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.... భర్త మీద కోపంతో తల్లి తన కొడుకుని కావాలనే లోఫర్‌గా పెంచుతుంది. టైటిల్‌ 'లోఫర్‌' అయినంత మాత్రాన సినిమా అలా ఉండదు. ఇందులో అమ్మ చని పోయిందని కొడుకు (హీరో) చెబుతాడు. కొడుకు చని పోయాడని తల్లి చెబుతుంది. తండ్రి చనిపోయాడని కొడుకు చెబుతాడు. ఒకరిపై ఒకరు ఇలా చెప్పుకుంటారు. కాని అందరూ బతికే ఉంటారు. ఒక్క మదర్‌ సెంటిమెంట్‌ తప్ప దీనికి 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి'కి పోలికే లేదు. ఇందులోని మదర్‌సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. అన్నారు.


వరుణ్ తేజ మాట్లాడుతూ... ‘‘ఇందులో నేనో దొంగని. పూరి సినిమాల్లో కథానాయకుడు ఎలా ఉంటాడో.. అంతే జోష్‌తో సాగే పాత్ర ఇది. పూరిగారు ‘లోఫర్‌' అనే టైటిల్‌ చెప్పగానే కంగారుపడిపోయా. రషెస్‌ చూసుకొన్నాక ఇదే సరైన టైటిల్‌ అనిపించింది. మదర్‌ సెంటిమెంట్‌కి ప్రాధాన్యం ఉన్న చిత్రమిది. నిజానికి అది నచ్చే ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నా. ఒక దశలో ఈ చిత్రానికి ‘అమ్మ' అనే పేరు పెడదామనుకొన్నాం''అన్నారు .

English summary
Last night, a special preview show was held for Megastar Chiranjeevi and his family at Prasad Labs in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu