»   » రామ్ చరణ్, బాలకృష్ణ ఫిల్మ్ స్టూడియోలు, చిరు గెస్ట్ గా

రామ్ చరణ్, బాలకృష్ణ ఫిల్మ్ స్టూడియోలు, చిరు గెస్ట్ గా

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : రామ్ చ‌ర‌ణ్ , నంద‌మూరి బాల‌కృష్ణ ..వైజాగ్ లో స్టూడియో క‌ట్టాలనే ఆలోచ‌న వున్న‌ట్టు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న సరైనోడు ఆడియో సెలబ్రేషన్స్ ని వైజాగ్ లో జరుపటానికి చేస్తున్న సన్నాహాలలో భాగంగా వైజాగ్ డాల్ఫిన్ హోటల్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అల్లు అరవింద్ తో పాటు గంటా శ్రీనివాసరావు కూడా పాల్గొని ఇలా స్పందించారు.

ఏప్రిల్ 10 న విశాఖ‌ప‌ట్నం లో అత్యంత భారీగా ఆర్‌.కె బీచ్ లో దాదాపు రెండు కిలోమీట‌ర్ల ప‌రిధిలో పూర్తి ఎల్‌.ఇ.డి స్క్రీన్స్ తో మెట్ట‌మెద‌టి సారిగా ఆడియో సెల‌బ్రేష‌న్స్ చేస్తున్నారు.


Chiranjeevi as chief guest for Sarrainodu audio celebrations

మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ''విశాఖపట్నంలో సహజసిద్ధంగా ఏర్పడిన అనేక సుందర ప్రాంతాలున్నాయి. అరకు, లంబసింగి తదితర ప్రాంతాల్లో ఏదో సినిమా చిత్రీకరణ జరుగుతూనే ఉంటుంది. దాన్ని ఇంకా పెంచాలి. బాలకృష్ణ, రామ్‌చరణ్‌, రాజేంద్రప్రసాద్‌ లాంటివాళ్లు విశాఖలో ఫిలిం స్టూడియోలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.


ఫిల్మ్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ వాళ్లూ ఇక్కడ స్టూడియో ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. వాళ్లకు 16 ఎకరాల భూమి కేటాయించాం. సత్యానంద్‌గారి నేతృత్వంలో ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నాం. విశాఖలో పరిశ్రమ అభివృద్ధికి 'సరైనోడు' విజయోత్సవం నాంది కావాల''అన్నారు.


నిర్మాత అల్లు అర‌వింద్ మాట్లాడుతూ.. చాలా కాలం నుండి గంటా శ్రీనివాస‌రావు గారు వైజాగ్ లో ఏదైనా పెద్ద సినిమా ఫంక్ష‌న్ చేయాల‌ని కొరుతున్నారు. అలాగే అల్లు అర్జున్ కి అన్ని ఏరియాల కంటే వైజాగ్ లో మంచి మార్కెట్ వుంది. బ‌న్ని కి వైజాగ్ తొ మంచి అనుభందం వుంది.


Chiranjeevi as chief guest for Sarrainodu audio celebrations

కొత్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఇదే అతి పెద్ద ఫంక్ష‌న్ గా వుండ‌బోతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిగా హ‌జ‌ర‌వుతున్నారు. బ‌న్ని, ముగ్గురు హీరోయిన్స్ హ‌జ‌ర‌వుతున్నారు. అలాగే మ్యూజిక్ డైర‌క్ట‌ర్ థ‌మ‌న్ ఫెర్‌ఫార్మెన్స్ చేయ‌బోతున్నాడు. ఇంకా చాలా టాలెంట్‌డ్ షో లు చేస్తున్నాము.


ఆంద్ర‌ప్ర‌దేశ్ లో కూడా ఇలాంటి పెద్ద ఫంక్ష‌న్స్ జ‌ర‌గటానికి, అలాగే షూటింగ్స్ కూడా జ‌ర‌గ‌టానికి అన్ని విధాల స‌హ‌యస‌హ‌కారాలు అందిస్తాము. మా స‌రైనోడు చిత్రం ఏప్రిల్ 22న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఏప్రిల్ 10 న ఆడియో సెల‌బ్రేష‌న్స్ జ‌రుపుతున్నాము.అని అన్నారు.

English summary
The makers of Allu Arjun's "Sarrainodu" (Sarainodu) have planned a grand function to celebrate the success of its audio, and Megastar Chiranjeevi will be chief guest at this event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu