»   » చిరు రిక్వెస్ట్ ని సునీల్ నో, కానీ చిరు మాత్రం ఓకే చేసారను

చిరు రిక్వెస్ట్ ని సునీల్ నో, కానీ చిరు మాత్రం ఓకే చేసారను

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌ : ఆమధ్యన చిరంజీవి 150 వ చిత్రం లో పాత్ర కోసం సునీల్ ని అడగారనే సంగతి తెలిసిందే. సునీల్ డేట్స్ ఎడ్దెస్ట్ చేయలేక నో చెప్పారు. చిరంజీవి సీన్ లోకి వచ్చినా ఫలితం లేకపోయింది. అయితే సునీల్ పరిస్దితి అర్దం చేసుకుని ఓకే అన్నారు. అయితే ఇప్పుడు సునీల్ వెళ్లి చిరంజీవి ని తన చిత్రం ఆడియో ఫంక్షన్ కు రమ్మనమని రిక్వెస్ట్ చేసారట. అయితే చిరంజీవి మాత్రం వెంటనే ఓకే చిసినట్లు సమాచారం.

పూర్తి వివరాల్లోకి వెలితే... సునీల్‌, మన్నారా చోప్రా జంటగా వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'జక్కన్న'. అందాలరాముడు, మర్యాదరామన్న, కృష్ణాష్టమి వంటి చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సునీల్‌ తాజాగా 'జక్కన్న'తో మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు.

ఈ చిత్రం ఆడియో వేడుక ఈ రోజు సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో నిర్వహించనున్నారు. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథి మెగాస్టార్‌ చిరంజీవి వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాత బీఏ రాజు ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. మొగాస్టార్‌పై విపరీతమైన అభిమానమున్న సునీల్‌కి ఆయన చేతులమీదుగానే ఆడియో వేడుక జరగడం మరింత ఉత్సాహాన్నిస్తుందంటున్నారు ఫ్యాన్స్.

నిర్మాత ఆర్.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ...... "సునీల్ గారు నటించిన మంచి ఎనర్జిటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. సునీల్ పెర్ ఫార్మెన్స్ హైలైట్ గా ఉంటుంది. ఈ చిత్రానికి జక్కన్న అనే టైటిల్ పర్ ఫెక్ట్ గా సరిపోతుంది.

డైరెక్టర్ వంశీ కృష్ణ అకెళ్ళ ఎవరూ టచ్ చేయని పాయింట్ ని ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించారు. ప్రేమకథా చిత్రం తర్వాత మా బ్యానర్ నుంచి వస్తున్న ఈ జక్కన్న చిత్రం అందరినీ అలరిస్తుంది.అంటూ చెప్పారు. ఇదివరలో వచ్చిన ప్రేమకథా చిత్రంలో ఎన్ని ట్విస్టులుంటాయో ఇప్పుడ్డు జక్కన్న లో కూడా అన్ని ట్విస్టులుంటాయనీ చెప్పారు..

ఆర్‌పి‌ఏ క్రియేషన్స్ పతాకం పై సుదర్శన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి దినేష్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ చిత్రం జూలై నెలాఖరులో కానీ ఆగష్టు లో కానీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు వీరు పోట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈడు గోల్డ్ ఎహే చిత్రంలోనూ సునీల్ నటిస్తున్నాడు.

గతంలో పూల రంగడు సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించిన సునీల్ సిక్స్‌ప్యాక్ బాడీతో కనిపించిన సునీల్ మరోసారి 'జక్కన్న'లో కూడా అలా కనిపించబోతున్నారు. ఇంతకు ముందు ఈ సినిమాకు అగ్గిపుల్ల, సైనికుడు అనే టైటిల్స్‌ను పరిశీలించారు. అయితే చివరగా 'జక్కన్న' టైటిల్ ఖారు చేసారు. సినిమా కథ కూడా జక్కన్న అనే టైటిల్‌కి యాప్ట్ అయ్యే విధంగా ఉండటం, రాజమౌళి నిక్ నేమ్ కావడం కూడా కలిసొస్తుందని భావిస్తున్నారు.

English summary
Sunil’s ‘Jakkanna’ movie audio launch event is going to held at Hyderabad and recent sources revealed that Mega Star Chiranjeevi will attend as chief guest for ‘Jakkanna’ movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu