»   » పెళ్లి వేడుకలో చిరంజీవి-బాలయ్య ఎఫెక్షన్ చూసారా? (ఫోటోస్)

పెళ్లి వేడుకలో చిరంజీవి-బాలయ్య ఎఫెక్షన్ చూసారా? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు సంగీత దక్శకుడు కోటి తనయుడు రాజీవ్ సాలూరి వివాహం ప్రత్యూషతో బుధవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులంతా హాజరయ్యారు.

సంగీత దర్శకుడు కోటి ఇద్దరు కుమారుల్లో రోషన్ ఇప్పటికే తండ్రి వారసత్వంతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. రాజీవ్ నటుడిగా పరిచయం అయ్యారు. రాజీవ్ ఇప్పటికే పలు చిత్రాల్లో హీరోగా నటించారు. అయితే ఇంకా సరైన బ్రేక్ రాలేదు.

రాజీవ్ సాలూరి పెళ్లి వేడుకలో చిరంజీవి, బాలయ్య ఇంకా స్టార్స్ ఫోటోస్ కోసం క్లిక్ చేయండి

Chiranjeevi-Balakrisha at Rajeev Saluri wedding reception

కాగా... ఈ వేడుకలో చిరంజీవి, బాలయ్య ఒకరికొకరు ఎదురు పడ్డారు. ఈ ఇద్దరూ చేతులు కలుపుకుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. సరదాగా మాట్లాడుకున్నారు. ఇద్దరు మధ్య అంత అఫెక్షన్ ఉండటం వేడుకకు హాజరైన వారిని ఆకట్టుకుంది.

ఇటీవల మీలో ఎవరు కోటీశ్వరుడు షో లాంచ్ సందర్భంగా కూడా చిరంజీవి మాట్లాడుతూ బాలయ్య గురించి ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. నా పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ, సల్మాన్ ఖాన్, నేను కలిసి సరదాగా డాన్స్ చేసిన విషయం గుర్తు చేసుకున్నారు. బాలకృష్ణ నాకు మంచి స్నేహితుడు, ఆయన మీలో ఎవరు కోటీశ్వరుడు షోలో నటిస్తే నాకు సంతోషమే అని చిరంజీవి తెలిపారు.

English summary
Music director Koti son Rajeev Saluri started his career as an actor.H e Got Married to Prathyusha on feb 22nd 2017.we colleted few pics from their wedding. Chiranjeevi.. Balayya have attended this reception. As both the stars arrived at the venue at the same time, they greeted each other affectionately and had a funny conversation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu