For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తారక రాముడి కళ్యాణ శోభలో తళుక్కుమన్నమెగాస్టార్...!

By Sindhu
|

నందమూరి తారక రామారావు వివాహం లక్ష్మీ ప్రణతితో అందరూ కోరుకున్నట్టుగా అతి వైభవంగా సాంప్రదాయ బద్దంగా జరిగింది. తారక రాముడు పెళ్లికి మూడు తరాల సీనియర్, యంగ్, జూనియర్ సినీ తారలన్నీ దిగివచ్చాయి. ఎన్టీఆర్ అభిమానులు ఎందరో వచ్చి అభినందనలు తెలిపారు. సిఎం కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దీవించారు. ఇంకా బంధువులు, మిత్రులు, 12000వుల మంది వరకూ వివాహ వేడుకల్లో పాల్గొన్నారు. వచ్చిన అతిథులనందరినీ చిరునవ్వుతో పలకరించిన చూడముచ్చటైన అందమైన జంటతో పాటు ముఖ్య అతిథులను చూసుకోవడం కోసం తండ్రి హరికృష్ణ, కూడా ప్రక్కనే ఉన్నారు.

ఎన్టీఆర్ పెళ్లిలో ప్రస్పుటంగా కనిపిస్తున్న అలంకరణలు ఆర్బాటాలతో పాటు శ్రీరామరాజ్యం సినిమా కోసం మీసాలు తీసేసిన బాలకృష్ణ వేదిక మీద ప్రత్యేక ఆకర్ణణలో కనిపించారు. మరో ప్రక్క మెగాస్టార్ చిరంజీవి జూ ఎన్టీఆర్-ప్రణతీలను ఆశీర్వదించారు. అంతే కాదు అక్కినేని నాగేశ్వరరావు, రామానాయుడు, నాగార్జున, రాఘవేంద్రరావు, మురళీమోహన్, మహేష్, రామ్ చరణ్ ....ఇలా చెప్పుకుంటూ పోతే, సినీ పరిశ్రమ మొత్తంగా జూనియర్ పెళ్లికి తరలివచ్చిందనే చెప్పుకోవాలి.

మరో ప్రక్క సాంప్రదాయబద్దంగా పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు పరస్పరం నెత్తిమీద జిలకరబెల్లం బెట్టుకోవడం, తలంబ్రాలు పోసుకోవడం, మంగళసూత్ర ధారణ, దండలు మార్చుకోవడం, పెళ్ళి కొడుకు పెళ్లికూతురికి మెట్టెలు తొడగటం, అరుందతీ నక్షత్రాన్ని చూడటం, ఇద్దరూ కలిసి వసంత పాత్రలోంచి బంగారు వెండి ఆభరణాలను పోటీ పడి అందుకోవటంలాంటి వేడుకలతో నయనానందంగా జరిగింన తర్వాత పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఒకరి నొకరు కరాచలనం చేసుకుని అభినందించుకున్నారు.

డబ్బు ఉన్న వారెవరైనా ఖర్చుపెడతారు. అదేమీ గొప్పకాదు కానీ, దాన్ని ఖర్చు పెట్టే విధానం, అతిథులను గౌరవించే పద్దతి, కళాత్మకమైన అలంకరణ, ఇవి చాలా ముఖ్యం. వీటిన్నింటినీ మించి అసలు కార్యక్రమమైన వివాహాన్ని సాంప్రదాయ పద్దతులను ముహోర్తాలను దష్టిలో పెట్టుకుని నిర్వహించటం అతి ప్రధానమైన కార్యం. వీటన్నింటికీ న్యాయం చేస్తూ వివాహాన్ని వైభవం తగ్గకుండానే నిర్విఘ్నంగా నిర్వహించటం శ్లాఘనియం.

English summary
Megastar Chiranjeevi and his son Ram Charan attended Jr.NTR and Lakshmi Pranathi’s wedding reception last evening and wished them. Marriage muhurtham was past midnight, so they could not stay till wedding time and left after reception. Many bigwigs from telugu and tamil movies like Balakrishna, Mahesh Babu, Krishna, D.Ramanaidu, Ashwini Dutt, tamil hero Karthi, S.S.Rajamouli attended the event.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more