»   »  తెలంగాణాకు సై అంటేనే చిరుకు సపోర్ట్

తెలంగాణాకు సై అంటేనే చిరుకు సపోర్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu
తెలంగాణా విషయంలో చిరంజీవి స్పష్టమైన వైఖరిని ప్రకటించిన తరువాతే సహకారం అందించాలా వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చిరంజీవి మెగా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆఫ్ వరంగల్ చెబుతున్నారు. ప్రత్యేక తెలంగాణాకు చిరంజీవి అనుకూలంగా లేకపోతే తమ మద్ధతు చిరంజీవికి ఉండదని వారు స్పష్టం చేస్తున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు భద్రినాథ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ తమకు ప్రత్యేక తెలంగాణా చాలా ముఖ్యమని, ఆ తరువాతే చిరంజీవి అని ఈ విషయాన్ని చిరంజీవి దగ్గరే తేల్చుకోవడానికి తమ ప్రతినిధులు చిరంజీవిని కలుస్తారని ఆయన అన్నారు. ఒకవేళ చిరంజీవి తెలంగాణాకు అనుకూలంగా ఉంటే ఆయనను ఏ శక్తి ఆపలేదని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X