»   »  బెల్లీ డాన్స్: మళ్లీ వార్తల్లోకి చిరంజీవి చిన్న కూతురు!

బెల్లీ డాన్స్: మళ్లీ వార్తల్లోకి చిరంజీవి చిన్న కూతురు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి, రామ్ చరణ్ సినిమాలు, రాజకీయాలకు సంబంధించిన అంశాలతో ఎప్పడూ వార్త్లల్లో ఉంటరు. చిరు కుటుంబంలో ఈ ఇద్దరి తర్వాత ఎక్కువగా వార్తల్లో నానిన వ్యక్తి ఆయన చిన్న కూతురు శ్రీజ. శ్రీజ ప్రేమ వివాహం అప్పట్లో ఓ సంచలనం అయిన సంగతి తెలిసిందే.

భర్తతో విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్న శ్రీజ.... తర్వాత విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదువుకున్నారు. శ్రీజ లండన్లో చదువు కుంది. ఇక్కడి కాన్వెంట్రీ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. శ్రీజ చదువుతున్న బ్యాచ్ కాన్వొకేషన్ కార్యక్రమం గతేడాది జరుగగా... చిరంజీవి దంపతులు కూడా హాజరయ్యారు.

Chiranjeevi daughter Belly dance?

తాజాగా... శ్రీజ మరోసారి వార్తల్లోకి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ప్రస్తుతం బెల్లీ డ్యాన్సింగ్ వర్క్ షాప్‌లో భాగంగా ప్రాక్టీస్ చేస్తోందని, ఇదంతా త్వరలో వెండి తెరపై మరవడానికే అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఏదో కాలక్షేపం కోసం ఎవరో ఒకరి దగ్గర ఈ డాన్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంత పెద్ ఇష్యూ అయ్యుండేది కాదు.

కానీ... శ్రీజ శిక్షణ తీసుకుంటోంది ఇండియన్ గాట్ ట్యాలెంట్‌లో లీడ్ కొరియోగ్రాఫర్ అయిన మెహర్ మాలిక్ కావడంతో ఈవిషయం హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే నాగబాబు కూతురు నిహారిక వెండితెరపై హీరోయిన్ గా ‘ఒక మనసు' చిత్రం ద్వారా ఎంట్రీకి సిద్దమవుతుండగా ఇపుడు శ్రీజ వ్యవహారం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

English summary
Source said that, Chiru's Daughter Srija enrolled herself in a week long Belly-Wood belly dancing workshop conducted by renowned belly dancer and lead choreographer at the successful reality talent show, India's Got Talent, Meher Malik.
Please Wait while comments are loading...