»   » శ్రీజ రెండో పెళ్లి: చిరు అల్లుడి గురించి పూర్తి డిటేల్స్..

శ్రీజ రెండో పెళ్లి: చిరు అల్లుడి గురించి పూర్తి డిటేల్స్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండో వివాహానికి సంబంధించిన సందడి ఆల్రెడీ మెగా ఫ్యామిలీలో మొదలైంది. అయితే ఈ పెళ్లిని పూర్తిగా ప్రైవేట్ కార్యక్రమంగా నిర్వహించడానికే ఆసక్తి చూపుతోంది చిరు కుటుంబం. కనీసం పెళ్లి సంబంధించి విషయాలు, చివరకు చిరు తనకు కాబోయే అల్లుడి గురించి వివరాలు కూడా బయటకు చెప్పేందుకు ఇష్ట పడటం లేదు.

 Srija

ఇలాంటి విషయాలు ఎంత రహస్యంగా ఉంచినా బయటకు పొక్కక మానవు. తాజాగా చిరంజీవి కాబోయే అల్లుడి గురించి వివరాలు బయటకు లీకయ్యాయి. శ్రీజ పెళ్లాడే వ్యక్తి పేరు కళ్యాణ్. చిత్తూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త కిషన్ కుమారుడని టాక్. యూఎస్ఏలో బిజినెస్ మేన్ గా సెటిలైన ఎన్నారై. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే....శ్రీజ, కళ్యాణ్ క్లాస్‌మేట్స్ కూడా. తన గురించి అన్ని తెలిసిన కళ్యాణ్‌ను పెళ్లాడేందుకు శ్రీజ సముఖంగా ఉండటంతో ఇరు కుటుంబాల వారు పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల చిరంజీవి తన ఇంట్లో పెళ్లి తంతులో పాల్గొన్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అయితే అది శ్రీజ నిశ్చితార్థ వేడుక అని సమచారం. మార్చి నెలలో పెళ్లి జరుగుతుందని, ఈ వివాహాన్ని గ్రాండ్ గా జరిపేందుకు చిరంజీవి నిర్ణయించారట. త్వరలోనే ఆయన ఈ విషయమై అపీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉంది.

Chiranjeevi

శ్రీజ ప్రేమ పెళ్లి వ్యవహరం గురించి అందరికీ తెలిసిందే. శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న శ్రీజ....కొంత కాలం అతనితో కాపురం చేసి ఓ బిడ్డకు తల్లయింది. ఆ తర్వాత శిరీష్ భరద్వాజ్ అసలు రూపం తెలుసుకుని అతనికి దూరమైంది. శ్రీజ మొదటి పెళ్లి వ్యవహారం మెగా ఫ్యామిలీకి ఓ పీడకలలా ముగిసిందని కొందరు అంటుంటారు.

English summary
Megastar Chiranjeevi's second daughter Srija will wed an NRI Kalyan from Chitoor in March, after her first marriage ended in divorce.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu