»   »  "నాన్న కోసమే" మెగాస్టార్ పెద్దకూతురు పూజలు.... అక్కడ కనిపించటం సర్ప్రైజే మరి

"నాన్న కోసమే" మెగాస్టార్ పెద్దకూతురు పూజలు.... అక్కడ కనిపించటం సర్ప్రైజే మరి

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాన్న సినిమా కోసం మెగాస్టార్‌ పెద్ద కూతురు ప్రత్యేక పూజలు చేసింది. చిరు కుమార్తె సుస్మిత కాణి పాకం లో కనిపించగానే అక్కడున్న వారంతా సర్ప్రైజ్ అయ్యారు. ఆది వారం ఆమె వరసిద్ధుడి దర్శనార్థం కాణిపాకం వచ్చి మరీ చిరూ రాబోయే సినిమా విజయవంతం కావలని కోరుకొని పూజలు చేసింది. సుస్మిత తో పాటు చిరు అభిమాన్లూ పెద్ద ఎత్తున ఆమెతో పాటు వచ్చారు.

Chiranjeevi daughter Susmitha visits Kanipakam Temple Chittoor

ఆల్‌ ఇండియా చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామి నాయుడు మాట్లాడుతూ.. ఈ నెల 22 న మెగాస్టార్‌ జన్మదినం పురస్కరించుకొని రాష్ట్రంతోపాటు తెలంగాణ, తమిళనాడు, కేరళలోని ప్రధాన ఆలయాల్లో తొమ్మిది రోజుల పాటు పూజలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మొదటి పూజ వినాయకుడి తోనే మొదలు పెట్టాలనే కాణిపాకం నుంచే మొదలు పెట్టారట. ఆదివారం ఈ పూజలను ప్రారంభించినట్లు తెలిపారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా లక్ష మొక్కలు నాటి, రక్తదాన శిబిరాలు నిర్వహించబోతున్నారు. దీనికి గానూ ప్రత్యేక ఏర్పాట్లు ఇప్పటికే సాగుతున్నాయట.

చివరిరోజైన 22వతేదీ హైదరాబాద్‌ ఫిలింనగర్‌లోని సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు వివరించారు. కార్యక్రమంలో టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు వరప్రసాద్‌, రాష్ట్ర చిరంజీవి అభిమాన సంఘం ఉపాధ్యక్షుడు అశోక్‌సామ్రాట్‌ యాదవ్‌, జిల్లా గౌరవాధ్యక్షుడు మండీసుధ, అధ్యక్షుడు కృష్ణమూర్తి, ఉపాధ్యక్షుడు పూలప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శి మునిరాజేంద్రరెడ్డి, కార్యదర్శి భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

English summary
Mega star Chiranjeevi Elder daughter Susmitha visits Kanipakam Temple Chittoor District
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu