»   » చిరంజీవి కూతురు శ్రీజ వెడ్డింగ్ కార్డ్ ఇదే, గ్రాండ్ రిసెప్షన్ (ఫోటోస్)

చిరంజీవి కూతురు శ్రీజ వెడ్డింగ్ కార్డ్ ఇదే, గ్రాండ్ రిసెప్షన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ వివాహం ఈ నెల 28న జరుగబోతున్న సంగతి తెలిసిందే. బెంగూళూరులోని మెగా ఫ్యామిలీకి చెందిన ఫాం హౌస్ వివాహ వేడుక జరుగబోతోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొంటారు.

బెంగుళూరులో పెళ్లి జరిగిన అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేసారు చిరంజీవి. మార్చి 31న హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో వెడ్డింగ్ రిసెప్షన్ జరుగబోతోంది. ఈ వివాహ విందుకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు హాజరు కాబోతున్నారు.

మెగా ఫ్యామిలీ నుండి ఇన్విటేషన్ కార్డ్స్ కూడా సిద్దం అయ్యాయి. పెళ్లి ముహూర్తం కూడా దగ్గర పడుతుండడంతో కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్‌ని కూడా మొదలు పెట్టారు. పింక్‌ కలర్‌లో ఉన్న ఈ కార్డ్‌ పై కొణిదెల ఫ్యామిలీ లోగోతో పాటు సురేఖ, చిరంజీవి పేర్లను ముద్రించారు. ఇన్విటేషన్ ను మీరు స్లైడ్ షోలో చూడొచ్చు...

శ్రీజ పెళ్లికి సంబంధించిన చిరంజీవి, రామ్ చరణ్ చాలా కేర్ తీసుకుంటున్నారు. శ్రీజ వెడ్డింగ్ వెన్యూ ఫిక్స్ చేసేందుకు రామ్ చరణ్ నార్త్ ఇండియాలోని పలు ప్రాంతాలను కూడా సందర్శించారట. ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణం నేపథ్యంలో చల్లని ప్రాంతమైన బెంగుళూరు అయితేనే బెటరని, సొంత ఫాం హౌస్ లో అయితే మరింత సౌకర్యంగా ఉంటుందని.....ఫాం హౌస్ లోనే పెళ్లి చేయాలని డిసైడ్ చేసారు.

శ్రీజ పెళ్లి వేడుకకు హాజరయ్యేలా మెగా ఫ్యామిలీలోని యాక్టర్లంతా తమ షూటింగ్ షెడ్యూల్స్ లో మార్పులు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ తో సహా మెగా ఫ్యామిలీలోని స్టార్స్ అంతా ఈ పెళ్లి వేడుకలో సందడి చేయబోతున్నారు. పవన్‌ త్వరలో సర్ధార్‌ సినిమాకు సంబంధించి యూరప్‌ వెళ్ళనుండగా, పెళ్ళి ముందు రోజు హైదరాబాద్‌కి వస్తారని తెలుస్తుంది.

వరుడు కళ్యాణ్ శ్రీజ చిన్ననాటి స్కూల్ మేట్ కావడంతో....ఇరు కుటుంబాల మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని తెలుస్తోంది. వరుడు కళ్యాణ్ ప్రముఖ వ్యాపారవేత్త కెప్టెన్ కిషన్ కుమారుడు. దుబాయ్ లోని బిట్స్ పిలాని నుండి పట్టబద్రుడయ్యాడు. శ్రీజ లండన్ లోని కావెంట్రీ యూనివర్శిటీలో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం కళ్యాణ్ జ్యువెలరీ డిజైనింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. వారి ఫ్యామిలీకి హైదరాబాద్ లో జ్యువెలరీ బిజినెస్ ఉంది.

ఇన్విటేషన్

ఇన్విటేషన్


మెగా ఫ్యామిలీ నుండి వెడ్డింగ్ రిసెప్షన్(డిన్నర్) ఇన్విటేషన్.

శ్రీజ వెడ్స్ కళ్యాణ్

శ్రీజ వెడ్స్ కళ్యాణ్


శ్రీజ తనప చిన్ననాటి స్నేహితుడు కళ్యాణ్ ను పెళ్లాడబోతోంది.

వెడ్డింగ్ ప్రిపరేషన్

వెడ్డింగ్ ప్రిపరేషన్


శ్రీజ వెడ్డింగ్ ప్రిపరేషన్ లో సురేఖ, ఉపసన తదితరులు...

మెగాస్టార్

మెగాస్టార్


కూతురు వివాహ వేడుకలో భాగంగా జరిగే కార్యక్రమంలో చిరంజీవి....

పండగ వాతావరణం

పండగ వాతావరణం


శ్రీజ వివాహ వేడుకలో మెగా కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది.

శ్రీజ హ్యాపీ

శ్రీజ హ్యాపీ


కళ్యాణ్ తో వివాహంతో కొత్త జీవితం ప్రారంభించబోతున్న వేళ శ్రీజ చాలా హ్యాపీగా ఉంది.

పెళ్లి కళ

పెళ్లి కళ


శ్రీజ ఫేసులో పెళ్లి కళ ఉట్టి పడుతోంది కదూ...

కజిన్స్ తో కలిసి

కజిన్స్ తో కలిసి


కజిన్స్ నిహారిక, వరుణ్ తేజ్ తో కలిసి శ్రీజ....

ఔటింగ్

ఔటింగ్


తన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి శ్రీజ ఔటింగ్...

చూడ ముచ్చటైన జంట

చూడ ముచ్చటైన జంట


శ్రీజ, కళ్యాణ్ లను చూసిన వారంతా చూడముచ్చటైన జంట అంటున్నారు.

పెళ్లి సందడి

పెళ్లి సందడి


చిరంజీవి ఇంట్లో పెళ్లి సందడి...

English summary
As we have reported earlier, Megastar Chiranjeevi's younger daughter, Srija Konidela's marriage will take place in Bangalore, at their farm-house, which is going to be a complete family affair, on 28 March. Apparently, Chiru is said to be hosting a grand wedding reception in Hyderabad, on 31 March and many big-wigs from the film industry as well as the political arena, were already invited to bless the couple.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu