For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఈ సాటి మెగా టర్మ్..... ఇక అన్నయ్యే కోటి రూపాయలిస్తాడట

  |

  అమితాబ్ లాంటి సూప‌ర్‌స్టార్ హిందీలో కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి లాంటి బుల్లితెర షోను ఓ రేంజ్‌లో హిట్ చేశారు. ఇక ఇక్క‌డ మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోను కూడా నాగార్జున సైతం అదే రీత‌లో ర‌క్తిక‌ట్టించి అంద‌రూ ఈ షోకు అతుక్కుపోయేలా చేశారు. ఈ షో ద్వారా ఎంతోమంది త‌మ టాలెంట్‌ను ప్ర‌ద‌ర్శించుకోవ‌డంతో పాటు భారీగా న‌గ‌దు గెలుచుకుని ఆర్థికంగా కూడా చాలా లాభ‌ప‌డ్డారు. ఒకప్పటి దుమారం కౌన్ బనేగా కరోడ్ పతీ కి పేరడీ గా వచ్చిన ప్రోగ్రాం " మీలో ఎవరుకోటీశ్వరుడు ?" తెలుగు వెండి తెర మన్మథుడు నాగార్జున స్టార్ స్టామినా తోనే మంచి హైప్ పొందిన ఈ ప్రొగ్రాం మళ్ళీ మొదలు కానుంది. అయితే ఇప్పటి వరకూ ఒక కింగ్స్ ఆఫ్ ద షో గా సాగిన ఈ షో ఇప్పుడు మెగా తళుకులతో మరో మ్యానియా గా మారనుంది.

  తాజా సమాచారం ఏమిటంటే హాట్ సీట్ ముందు కూర్చో బోయేది మెగాస్టార్ చిరంజీవి. నాగ్ ఉన్నఫ్ఫుడే ఈ షో ఒక సూపెర్ రెస్పన్స్ తో ఉన్న "మీలో ఎవరు కోటీశ్వరుడు" ఇప్పుడు చిరంజీవి తో మరింత గా మెరిసి పోనుంది. ఇప్పటికే మూడు సీజన్‌లు పూర్తిచేసుకున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్‌ను ఇకపై చిరు నడిపించనున్నారట. అంటే 'కింగ్‌' నాగార్జున స్థానంలో మెగాస్టార్‌ కనబడనున్నారన్నమాట. ఈ కార్యక్రమం డిసెంబర్‌లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి నాగార్జున ప్రయోగం తో మొదలు పెట్టిన ఒక షో ఇప్పుడు మెగా ఎంట్రీతో మరింత స్పెషల్ అవనుంది. ఆవివరాలేమిటో మీరే చూడండి....

  కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి :

  కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి :

  అమితాబ్ లాంటి సూప‌ర్‌స్టార్ హిందీలో కౌన్ బ‌నేగా క‌రోడ్‌ప‌తి లాంటి బుల్లితెర షోను ఓ రేంజ్‌లో హిట్ చేశారు. ఇక ఇక్క‌డ మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు షోను కూడా నాగార్జున సైతం అదే రీత‌లో ర‌క్తిక‌ట్టించి అంద‌రూ ఈ షోకు అతుక్కుపోయేలా చేశారు. మోదటి మూడు సిరీస్ లలోనూ మంచి రేటింగ్ నే రాబట్టుకుంది. ఒక్కొక్క ప్రశ్నతో ఒక్కొక్క మెట్టే ఎక్కిస్తూ మన తెలివితేటలతోనే లక్షలు సంపాధించుకునే కాన్సెప్ట్ తో వచ్చిన ప్రోగ్రాం లు తెలుగులో తక్కువే.

  అమితాబ్ స్టార్ స్టామినా:

  అమితాబ్ స్టార్ స్టామినా:

  హిందీలో వచ్చిన "కౌన్ బనేగా కరోడ్ పతీ" సక్సెస్ అవగానే ప్రతీ చానెల్ ఒక ప్రోగ్రాం ని మొదలు పెట్టేసింది. హిందీలోనే జీ నెట్వర్క్ శిల్పశెట్టితో "సవాల్ దస్ కరోడ్ కా", మళయాలం లో మమ్ముట్టి కోటీశ్వరన్ లాంటి ప్రోగ్రాం లు అప్పట్లో మంచి మార్కెట్ నే రాబట్టుకున్నయి.ఈ సిరీస్ కొన్నాళ్ళూ సురేష్ గోపి కూడా హోస్ట్ గా చేసారు . కానీ ఈ షోలు ఏవీ కూడా అమితాబ్ స్టామినా ముందు నిలబదలేక పోయాయి. అమితాబ్ స్టార్ స్టామినా అదే సమయం లో వచ్చే అన్ని ప్రోగ్రాం లనీ తట్టుకొని నిలబడటమే కాదు పది కోట్ల ఆఫర్ ఇచ్చిన జీ నెట్వర్క్ కూడా పక్కకు తప్పుకోవాల్సి వచ్చింది.

  బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా:

  బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా:

  తర్వాత కొన్నాళ్ళకి తెలుగులో మాటీవీ లోనే వచ్చిన బ్రెయిన్ ఆఫ్ ఆంధ్రా కూడా అప్పట్లో మంచి టీ ఆర్ పీ నే రాబట్టింది. అప్పుడు యాంకర్ ఝాన్సీ ఈ షో కి హోస్ట్ గా చేసి మంచి పేరు తెచ్చుకున్నారు కూడా.. ఐతే బ్రెయిన్ ఆఫ్ ఆంద్రా పారితోషికం 5 లక్షలే కావటం కాస్త తక్కువ మొత్తమే అనుకున్నారో ఏమో నాగ్ ఒక్క సారి కోటి రూపాయలతోఒక స్టార్ షోని తెరపైకి తెచ్చారు.. అసలు కింగ్ లంటి నాగార్జున కోసమే ఆ షోకి ఒక హైప్ వచ్చింది. కోటిరూపాయలే అయినా ఒక సాధారన యాంకర్ ఉండి ఉంటే "మీలో ఎవరు కోటీశ్వరుడు" అంత హిట్ అయ్యేది కాదేమో.

  మీలో ఎవరు కోటీశ్వరుడు:

  మీలో ఎవరు కోటీశ్వరుడు:

  నాగార్జున హోస్ట్‌గా ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' మూడు సీజన్లను కంప్లీట్‌ చేసుకున్న విషయం తెలిసిందే. తన హావభావాలతోనూ ఆయన స్టార్ రేంజ్ తోనూ తెలుగు రియాలిటీ షో కి స్టార్ తళుకులద్దారు. తన మెస్మరిజింగ్ స్మైల్ తో నూ మంచి వాక్చాతుర్యం తోనూ షోని సక్సెస్ గా రన్ చేసారు. చాలా మంది ఈ షొ ధ్వారా లక్షాధికారులయ్యారు. నాగ్ తన లో ని సాఫ్ట్ కన్సర్న్ ని కూడా చూపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఎంతోమంది లాభం పొందగా, ఇప్పుడు నాలుగో సీజన్‌ను కూడా తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిర్వాహకులు.

  నాగార్జున:

  నాగార్జున:

  ఇప్పటికే షో 3 సీజన్లు పూర్తి చేసుకుంది. కాని ఇక ముందు నాగార్జున ఈ షో చేయడం లేదని తెలిస్తోంది. కారణం నాగార్జున సినిమా ప్రాజెక్టకు ఒప్పుకోవడంతో షెడ్యూల్ కుదరక ఈ షోనుంచి తప్పుకుంటున్నట్టు సమాచారం..?.మరి ఈయన తీసుకున్న ఈ నిర్ణయంతో షో నిర్వహకులు కంగారు పడ్డారు. ఆల్ రెడీ మంచి రన్నింగ్ లో ఉన్న గేమ్ షో. ఇలాంటి హోస్ట్ ఎక్కడ దొరుకుతాడు.

  మరి ఆ వ్యక్తి ఎవరు?? :

  మరి ఆ వ్యక్తి ఎవరు?? :

  చక్కటి వాక్ చాతుర్యం కలిగిన వ్యక్తిలా అందరితో కలిసిపోయిన నాగార్జున అకస్మాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం అభిమానులకు, యాజమాన్యానికి ఇబ్బంది కలిగించే విషయమే.మరి ఈ కార్యక్రమాన్ని అంతగా విజయవంతం చేయగల ప్రతిభాశాలి తెలుగు ఇండస్ట్రీలో ఇంకా ఎవరున్నారు అన్న ప్రశ్న మొదలయ్యింది? నాగ్ తర్వాత వచ్చే స్టార్ నాగార్జున కి ఉన్న ఫాలోయింగ్ కి ఏమాత్రం తగ్గకుండా ఉండాలి... మరి ఆ వ్యక్తి ఎవరు??

  "మెగా స్టార్:

  సమాధానం "మెగా స్టార్" అనివచ్చింది... ఔను ఇప్పుడు అభిమానుల "అన్నయ్య" హాట్ సీట్ మీదికి వెల్కం అంటూ మిమ్మల్ని తీసుకు వెళ్తాడన్న మాట. దాదాపు పదేళ్లపాటు వెండితెరకు దూరమై ఇప్పుడు మళ్లీ ముఖానికి రంగేసుకున్నాడు మెగాస్టార్‌ . వినాయక్‌ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్‌ 150' సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్‌ పూర్తయిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తానని మెగాస్టార్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

  డిసెంబర్ 12 నుంచి మొదలు:

  డిసెంబర్ 12 నుంచి మొదలు:

  నాలుగో సీజన్ డిసెంబర్ 12 నుంచి మొదలుకాబోతోంది. దీనికి హోస్ట్ గా నాగ్ కు బదులు చిరు చేస్తారని ఇప్పటికే వార్తలొచ్చాయి. నాగ్ వద్దన్నారో లేక చిరు ఆసక్తి చూపారో తెలీదు గానీ నెక్స్ట సీజన్ మాత్రం చిరు చేయడం ఖాయమంటున్నారు. మూడో సీజన్ లో ఓ గెస్ట్ గా చిరంజీవి ఎంఇకె లో పాల్గొన్నాడు. ఇప్పుడు మాత్రం తానే హోస్ట్గా మారనున్నాడు.

  నాగ్‌ పెదవి విప్పాడు:

  నాగ్‌ పెదవి విప్పాడు:

  ఇప్పటివరకు నడిచిన మూడు సీజన్‌లలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన నాగార్జున స్థానంలో మెగాస్టార్‌ చిరంజీవి రంగప్రవేశం చేయనున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనితోపాటు ‘బాహుబలి-2' హక్కుల గురించి కూడా ‘నిర్మలా కాన్వెంట్‌' ప్రమోషన్‌ కార్యక్రమంలో నాగ్‌ పెదవి విప్పాడు.‘‘మీలో ఎవరు కోటీశ్వరడు' కార్యక్రమం నుంచి నేను విరామం తీసుకుంటున్నది నిజమే.

  ప్రోగ్రామ్‌ రేంజ్‌ మరింత పెరుగుతుంది:

  ప్రోగ్రామ్‌ రేంజ్‌ మరింత పెరుగుతుంది:

  నా స్థానంలో చిరంజీవి ఆ కార్యక్రమాన్ని నడిపిస్తారు. ఆయన రాకతో ఆ ప్రోగ్రామ్‌ రేంజ్‌ మరింత పెరుగుతుంద'ని ఆయన వ్యాఖ్యానించాడు. చిరు కోసం టైమింగ్స్ కూడా మార్చారు. సోమవారం నుంచి గురువారం దాకా ప్రతీరోజూ రాత్రి 8-30 గంటలకే ఇది ప్రసారమవుతుంది. చిరంజీవి నటిస్తున్న ఖైదీ నెంబర్ 150 షూటింగ్ కు ఇబ్బందికలగకుండా దీని షూటింగ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

  నాగార్జున స్థానంలో మెగాస్టార్‌:

  నాగార్జున స్థానంలో మెగాస్టార్‌:

  ‘మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్‌ను ఇకపై చిరు నడిపించనున్నారట. అంటే ‘కింగ్‌' నాగార్జున స్థానంలో మెగాస్టార్‌ కనబడనున్నారన్నమాట. ఈ కార్యక్రమం డిసెంబర్‌లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాదిన ఘనవిజయం సాధించిన అమితాబ్‌ ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమానికి తెలుగు వెర్షనే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు'. అంటే అమితాబ్‌ను ఆదర్శంగా తీసుకుని చిరంజీవి కూడా క్విజ్‌ మాస్టర్‌ అవతారం ఎత్తనున్నారన్నమాట.

  English summary
  Megastar Chiranjeevi To Host Meelo Evaru Koteeswarudu Season 4
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X