For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారి పరిస్థితి దయనీయం... ఆదుకొందాం: చిరంజీవి.. రాజమౌళి 50 లక్షలు.. 10 లక్షలతో మెగాస్టార్..

|

తెలుగు సినిమా పురోగతికి, ప్రతిష్టకు దిశానిర్దేశం చేసిన స్వర్గీయ దాసరి నారాయణరావును ఘనంగా స్మరించుకొన్నారు. సినీ పరిశ్రమకు చేసిన సేవలకు ఆయనకు నిజమైన నివాళిని అర్పించారు. హైదరాబాద్‌లో దాసరి నారాయణరావు పుట్టిన రోజు మే 4న డైరెక్టర్స్ డేగా పాటిస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, డైరెక్టర్లతోపాటు మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన సంచలన నిర్ణయం తీసుకొన్నారు.

 దాసరి లేకపోవడం తీరని లోటు

దాసరి లేకపోవడం తీరని లోటు

శనివారం సాయంత్రం జరిగిన డైరెక్టర్స్ డే కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి చిరంజీవి హాజరుకావడంతో భారీగా వేడుకను జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దాసరి నారాయణ సేవలను మెగాస్టార్ గుర్తు చేసుకొన్నారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని మరోసారి వేదికపైన వెల్లడించారు. ఆయన లేకపోవడం సినిమా పరిశ్రమకు తీరని లోటు అని చిరంజీవి అన్నారు.

మేము తాతామనవళ్లం

మేము తాతామనవళ్లం

స్వర్గీయ దాసరి నారాయణరావు జన్మదినాన్ని డైరెక్టర్స్ డేగా జరుపుకోవడం నిజంగా గొప్ప విషయం. ఓ దర్శకుడికి ఇంతకంటే గొప్ప నివాళి ఏమీ ఉంటుంది. దాసరి దర్శకత్వంలో నేను ఒకే సినిమాలో నటించాను. దర్శకుడిగా ఆయనతో నాకు రిలేషన్ తక్కువే. వ్యక్తిగతంగా మా మాధ్య ప్రత్యేకమైన రిలేషన్ ఉండేది. మేమిద్దరం సమీప బంధువులం. మాకు చుట్టరికం కూడా ఉంది. నాకు ఆయన తాత వరస. మేమిద్దరి తాతామనవళ్లం. దాసరి గారితో రోజులు పెరుగుతున్న కొద్ది మా మధ్య బంధం మరింత బలపడింది అని అన్నారు.

 ఖైదీ నంబర్ 150 వేడుకలో

ఖైదీ నంబర్ 150 వేడుకలో

‘ఖైదీ నంబర్ 150' వేడుక విజయవాడలో నిర్వహించినపుడు దాసరిగారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రీ ఎంట్రీ తర్వాత నన్ను ఇంటికి పిలిచి బొమ్మిడాయిల పులుసుతో మంచి భోజనం పెట్టారు. అల్లు రామలింగయ్య జాతీయ అవార్డుకు ఎంపికైతే స్వయంగా నేను ఆయన ఇంటికి వెళ్లి అందించాను. తెలుగు సినీ పరిశ్రమలో గొప్ప దర్శకులు చాలా మంది ఉన్నారు. వాళ్లలో దాసరి గారిది ప్రత్యేకమన శైలి. గొప్ప ప్రతిభ, మానవీయ కోణమున్న అలాంటి దర్శకుడు మళ్లీ రాడు అని చిరంజీవి తెలిపారు.

 రాజమౌళి 50 లక్షల విరాళం

రాజమౌళి 50 లక్షల విరాళం

తెలుగు సినీ పరిశ్రమకు గొప్పగా సేవ చేసిన కొందరు దర్శకుల పరిస్థితి దయనీయంగా ఉంది. అలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆర్థిక భారంతో చితికిపోయిన దర్శకుల కోసం రూ.5 కోట్లతో నిధిని ఏర్పాటు చేయాలన్నది నా ఆలోచన. అందుకు రాజమౌళి ముందుకు వచ్చారు. రూ.50 లక్షల విరాళం ఇస్తాను అని ప్రకటించారు. నేను రూ.10 లక్షలు, బాహుబలి నిర్మాతలు రూ.15 లక్షలు అందజేస్తాం అని చిరంజీవి పేర్కొన్నారు.

ఇద్దరి పిల్లలను చదివిస్తాను.. చిరంజీవి

ఇద్దరి పిల్లలను చదివిస్తాను.. చిరంజీవి

ఆర్థికంగా చితికిపోయిన దర్శకుల పిల్లలను చదివిద్దామనుకొంటున్నాను. మిగిలిన అగ్ర దర్శకులు కూడా చేతనైనంత సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్‌.శంకర్‌, ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్‌, ప్రముఖ దర్శకులు పాల్గొన్నారు. తొలి చిత్రాలతోనే ప్రతిభను చాటుకున్న వేణు ఊడుగుల (నీదీ నాదీ ఒకే కథ), వెంకటేష్‌ మహా (కేరాఫ్‌ కంచరపాలెం), వెంకీ కుడుముల (ఛలో), అజయ్‌భూపతి (ఆర్‌.ఎక్స్‌ 100)లకు పురస్కారాలు అందజేశారు. అలాగే దర్శకులు జనార్దన మహర్షి, వీఎన్‌ ఆదిత్య తదితరులను సత్కరించారు.

English summary
On the eve of Popular director Dasari Narayana Rao Birthday, Telugu film Industry celebrated Directors Day. Mega star Chiranjeevi attended as chief guest for this event and he donated Rs.25 lakhs for directors association.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more