కాన్స్ ఫిల్మ్ ఫెస్ట్‌కి... మెగాస్టార్ చిరంజీవి సైతం
మెగాస్టార్ చిరంజీవి పర్యాటక శాఖ మంత్రిగా భారత దేశంలోని పర్యాటక స్థలాలు, అంతర్జాతీయ ఫిల్మ్ మేకర్స్‌కు ఇక్కడ ఎలాంటి అనువైన ప్రదేశాలు, లొకేషన్లు ఉన్నాయనే విషయాలు వివరిస్తారు. భారతదేశం నుండి ప్రపంచ సినీ పరిశ్రమకు అందిన సహాయ సహకారాలు, ఇప్పటి వరకు భారతీయ సినిమా పురోగతి వంటి అంశాలను చిరు వివరిస్తారు.
భారతదేశంలో విదేశీ సినిమాలు చిత్రీకరించేందుకు అనువైన స్థలాలు, భారత ప్రభుత్వ సహాయ సహకారాలు ఎలా ఉంటాయి అనే విషయాలను వివరిస్తారు. పలు ఆస్కార్ అవార్డులు పొందిన లైఫ్ ఆఫ్ పై చిత్రం భారత్ లోని పుదుచ్చేరి, మున్నార్ వంటి ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకున్న విశేషాలు ఆయన వెల్లడిస్తారు.
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భారత దేశ టూరిజం, షూటింగులకు అనువైన స్థలాల గురించి ప్రచారం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని, పర్యాటక శాఖ అభివృద్ధికి ఇది ఎంతగానో దోహదం చేస్తుందని....మీడియాకు విడుదల చేసిన లేఖలో చిరంజీవి పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications












