»   » చిరంజీవి జోక్యం చేసుకోలేదు.. ఎలా చెబితే అలా చేస్తాను అన్నారు.. అదో కల..

చిరంజీవి జోక్యం చేసుకోలేదు.. ఎలా చెబితే అలా చేస్తాను అన్నారు.. అదో కల..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ పరిశ్రమలోకి ప్రవేశించిన కొద్దిరోజులకే తన ప్రతిభతో స్టార్ కోరియోగ్రాఫర్‌గా పేరుపొందరు వీజే శేఖర్. అగ్రతారల చేత స్టెప్పులు వేయించి మెప్పించారు. చిరంజీవి మొదలుకొని పలువురు స్టార్‌ కథానాయకులకి ఆయన నృత్యాలు సమకూర్చారు. బీ జయ దర్శకత్వం వహించిన వైశాఖం సినిమాలో అన్ని పాటలకీ శేఖర్‌ నృత్యాలు సమకూర్చారు. ఆ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడారు.

తొమ్మిదేళ్ల కెరీర్

తొమ్మిదేళ్ల కెరీర్

కోరియోగ్రాఫర్‌గా తొమ్మిదేళ్ల ప్రయాణం నిరాటంకంగా సాగింది. 400 పాటలకు నృత్యాలు సమకూర్చను. సినిమాలోని అన్ని పాటలకీ ఒక్కరే నృత్యరీతులు సమకూర్చితే ఆ ప్రభావం, ఆ ఫలితమే వేరుగా ఉంటాయి. గుండెజారి గల్లంతయ్యిందే, వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ తర్వాత ఒక సినిమాలోని అన్ని పాటలకీ నృత్యాలు సమకూర్చాను. కాబట్టి వాటికి మంచి స్పందన వచ్చింది అని శేఖర్ అన్నారు.


చిరంజీవితో పనిచేయడం కలలా.

చిరంజీవితో పనిచేయడం కలలా.

ఖైదీ నంబర్‌ 150కి పనిచేయడం ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం. చిన్నప్పట్నుంచీ చిరంజీవిని, ఆయన డ్యాన్స్‌ని చూస్తూ పెరిగాను. ఆయన చిత్రానికి నేను పనిచేయడం ఓ కలలా అనిపించింది. అమ్మడు లెట్స్‌ డు కుమ్ముడు...'తో పాటు ‘మి మి మిమ్మిమ్మి' పాటకి నృత్యాలు సమకూర్చా. డ్యాన్సుల్లో తిరుగులేని స్టార్‌ అయినప్పటికీ చిరంజీవిగారు ‘మీరెలా చెబితే అలా చేస్తాను మాస్టర్‌..' అంటూ సెట్లోకి వచ్చారు.


చిరు ఎప్పుడు సలహా ఇవ్వలేదు.

చిరు ఎప్పుడు సలహా ఇవ్వలేదు.

తప్ప, నాకు ఒక్క సలహా కూడా ఇవ్వలేదు. చిరంజీవి, రామ్‌చరణ్‌లు కలిసి చేసిన స్టెప్పుని ఎప్పుడెప్పుడు తెరపై చూసుకొందామా అనిపించింది. అవకాశం లభిస్తే ఆ ఇద్దరితోనూ మరో పాట చేయాలని ఉంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ ‘రంగస్థలం 1985', ఎన్టీఆర్‌ ‘జై లవకుశ', రవితేజ ‘రాజా ది గ్రేట్‌', ‘టచ్‌ చేసి చూడు' చిత్రాలతో పాటు నితిన్‌ కొత్త చిత్రానికి పనిచేస్తున్నాను అని వివరించారు.


మైనస్ డిగ్రీల చలిలోనూ..

మైనస్ డిగ్రీల చలిలోనూ..

ఇటీవల ఎక్కువగా అగ్ర కథానాయకుల చిత్రాలకి పనిచేస్తున్నా. కానీ ‘వైశాఖం'కి పనిచేస్తున్నప్పుడు నాకు తేడా ఏమీ అనిపించలేదు. రిహార్సల్స్‌ వల్ల నాయకానాయికలిద్దరూ ఎంతో అనుభవమున్న నటుల్లాగా నృత్యాలు చేశారు. కజకిస్థాన్‌లో మూడు పాటల్ని చిత్రీకరించాం. అక్కడ మైనస్‌ డిగ్రీల చలిలోనూ పాటకు తగ్గ స్టెప్పులేశారు అని తెలిపారు.


రాకేశ్ మాస్టర్ శిష్యరికంతో..

రాకేశ్ మాస్టర్ శిష్యరికంతో..

రాకేష్‌ మాస్టర్‌ వద్ద శిష్యరికం చేశా. సుధీర్‌బాబు కథానాయకుడిగా నటించిన ‘ఎస్‌.ఎం.ఎస్‌' సినిమాలోని ఇది నిజమే... పాటతో నాకు మంచి పేరొచ్చింది. అది చూసే అల్లు అర్జున్‌ నాకు ‘జులాయి'లోని ‘లాయి.. లాయి...' పాటని చేసే అవకాశాన్నిచ్చారు. ‘బాద్‌షా', ‘పిల్లా నువ్వు లేని జీవితం', ‘బ్రూస్‌లీ', ‘నాన్నకు ప్రేమతో', ‘జనతా గ్యారేజ్‌'.. ఇలా పలు చిత్రాల్లోని గీతాలకి నృత్యరీతులు సమకూర్చా అని తన కెరీర్ గురించి వివరించారు.English summary
Choreographer VJ Shekhar is star one in tollywood. He directed dance steps for Chiranjeevi in Khaidi No 150. Shekhar said.. while Khaidi no 150 Shooting Chiranjeevi never given suggestion on Khaidi no 150 sets
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu