»   » చిరంజీవి మాటిచ్చాడు: 150వ సినిమాలో అతనికి చోటుందా?

చిరంజీవి మాటిచ్చాడు: 150వ సినిమాలో అతనికి చోటుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రంలో ఓ బాలుడుకి అవకాసమిస్తానన్నారు...గుర్తుందా? కొన్ని నెలల క్రితం కేన్సర్ వ్యాధితో బాధ పడుతున్న తన బాల అభిమాని సంగెం బాలు(తక్షక్)ను పరామర్శించడానికి వెళ్లిన చిరంజీవి బాలు చురుకుదనం చూసి తన సినిమాలో అవకాశం ఇస్తానన్నారు. తాజాగా చిరంజీవి 150వ సినిమా ఖరారైన నేపథ్యంలో ఆ బాలుడికి అవకాశం వస్తుందా? లేదా? అనేది హాట్ టాపిక్ అయింది.

తన 150వ సినిమాలో చిరంజీవిగారు నాకు అవకాశం ఇస్తానన్నారు. అందుకే నేను డ్యాన్స్ కూడా నేర్చుకుంటున్నా. జనవరి 1న ఫోన్ చేసి నాకు కొత్త సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు.' అని కేన్సర్ బాధితుడు సంగెం బాలు (తక్షక్) ఆ మధ్య మీడియాతో ఆనందంగా చెప్పాడు.

ఆదిలాబాద్ జిల్లా జన్నారం ప్రాంతంలో....లక్ష్మణచాంద మండలానికి చెందిన సంగెం శ్రీధర్, పద్మల పెద్ద కుమారుడు బాలు క్యాన్సర్ బారిన పడి హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఆస్పత్రిలో చికిత్స పొందారు. ఆ సమయంలోనే బాలుడి కోరిక మేరకు చిరంజీవి వచ్చి పరామర్శించారు. ఆ సందర్భంగానే చిరంజీవి ఆ బాలుడికి తన 150వ సినిమాలో అవకాశం ఇస్తానని మాటిచ్చారు.

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తన 150వ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈచిత్రానికి ప్రస్తుతం ‘ఆటోజానీ' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ స్వయంగా నిర్మించబోతున్నారు.

Chiranjeevi offers role to terminally ill boy Balu in his 150th

ఈ సినిమా గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ... ఈ స్టోరీ నేను ఇప్పటికే విన్నాను. అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. ఇది పూర్తి యాక్షన్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ డ్రామాతో మిక్స్ అయిన కథ అని రాంచరణ్ తెలిపారు. ఇలాంటి చిత్రంలో గెస్ట్ రోల్ చేసే అవకాశం దక్కినా అదృష్టంగానే భావిస్తానని చరణ్ చెప్పుకొచ్చాడు.

సినిమాను పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా ఒక బృందం ఉందని, నిర్మాతగా తన మొదటి సినిమా చేయడానికి ఎంతోమంది ప్రెజర్ ఫీలయ్యారని, కానీ పూరీ జగన్నాథ్ ఒక్కడే కాన్ఫిడెంట్ గా ఉన్నారని చెప్పాడు. పూరీకి ఈ కథమీద మంచి పట్టుందని, టోటల్ గా‌ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ అవుతుందని చెర్రీ అన్నాడు.

కాపీ వివాదం...
చిరంజీవి 150వ సినిమా ప్రకటన అలా వచ్చిందో లేదో...ఇలా వివాదం తెరపైకి వచ్చింది. ఈ చిత్రం స్టోరీ కాపీ కొట్టారంటూ వివాదం నెలకొంది. ఈ వివాదం నేపథ్యంలో దర్శకుడు పూరి జగన్నాథ్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ఆటోజానీ స్టోరీ పూర్తిగా నేను ఒరిజినల్ గా తయారు చేసినల్ స్టోరీ. కొంత మంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మీడియాలో వస్తున్న వార్తలను నమ్మొద్దు' అంటూ ట్వీట్ చేసారు. పూరి స్వయంగా వివరణ ఇవ్వడంతో మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నాడు.

English summary
Chiranjeevi offers role to terminally ill boy Balu in his 150th.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu