74th Independence Day : త్యాగాలను స్మరించుకుందాం.. చిరు, పవన్, బన్నీ, చెర్రీ ట్వీట్స్ వైరల్

భారతదేశ 74వ స్వాతంత్య్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అయితే కోవిడ్ నిబంధనలు, కరోనా వ్యాప్తి కారణంగా గతంలో మాధిరిగా ఎక్కడా కూడా సమూహ వేడుకలను జరుపడం లేదు. ఈ క్రమంలో తమ తమ ఇంట్లో, కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి దేశ భక్తిని చాటుతున్నారు.ఈ క్రమంలో మన తారలు కూడా జెండాను ఎగురవేసి ప్రజలకు స్వాతంత్ర్య శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

చిరు శుభాకాంక్షలు..

చిరు శుభాకాంక్షలు..

నేటి స్వాత్రంత్ర్య దినోవ్సతవాన్ని పురస్కరించుకు చిరంజీవి సోషల్ మీడియా వేదికగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ‘అందరికీ 74వ స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ పునాదులు వేసిన మహానుభావుల త్యాగాలను, వారి ఆదర్శాలను మనమంతా గుర్తు చేసుకుందాం'అని ట్వీట్ చేశారు.

జెండా ఎగురవేసిన పవన్..

జెండా ఎగురవేసిన పవన్..

పవన్ కళ్యాణ్ తన జనసేన కార్యాలయంలో జెండా ఎగురవేశారు. 74వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జాతీయ పతాకాన్ని ఎగురవేసి వందనం చేశారు.

ఆర్ఆర్ఆర్ హీరోలు..

ఆర్ఆర్ఆర్ హీరోలు..

రామ్ చరణ్, ఎన్టీఆర్‌లు ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. ఈ మేరకు రామ్ చరణ్ స్పందిస్తూ.. ‘ప్రతీ ఒక్కరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మన దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న యోధులకు, కరోనా మహమ్మారిని అరికట్టడానికి పోరాడుతున్న వారియ‌ర్స్‌కు వందనం. మనమంతా కలిసికట్టుగా ఈ అడ్డంకులను త్వరలోని అధిగమిస్తాం'అని ట్వీట్ చేశాడు. ఇక ఎన్టీఆర్ స్పందిస్తూ.. 74వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతీ ఒక్కరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్ అని చెప్పుకొచ్చాడు.

Recommended Video

Pawan Kalyan, Chiranjeevi, Bandla Ganesh Green India Challenge
బన్నీ ట్వీట్..

బన్నీ ట్వీట్..


అల్లు అర్జున్ ట్వీట్ చేస్తూ.. నా భారతీయులందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు. మనకు స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం ప్రాణాలను త్యాగం చేసిన వారిని స్మరించుకుందాం జై హింద్ అని చెప్పుకొచ్చాడు. ఇక హీరోలు, హీరోయిన్లు, దర్శక నిర్మాతలు, నిర్మాణ సంస్థలు ఇలా ప్రతీ ఒక్కరూ ప్రజలందరికీ స్వాత్రంత్య దినోత్సవ శుభాకాంక్షలను తెలుపుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X