twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దేవదాస్ కనకాల కుటుంబ సభ్యులకు చిరంజీవి పరామర్శ!

    |

    Recommended Video

    Celebs Pay Homage to Devadas Kanakala | Chiranjeevi | SS Rajamouli | Rajendra Prasad || Filmibeat

    ప్రముఖ నటుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూసిన సంగతి తెలిసిందే. 74 సంవత్సరాలు దేవదాస్ మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన నివాసాన్ని సందర్శించి నివాళులు అర్పిస్తున్నారు.

    తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దేవదాస్ కనకాల భౌతిక కాయాన్ని శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా దేవదాస్ కుమారుడు రాజీవ్ కనకాల, ఇతర కుటుంబ సభ్యులను ఆయన ఓదార్చారు. ఆయన లేని లోటు తీర్చలేనిది, సినీ రంగానికి ఎంతో సేవ చేశారని తెలిపారు.

    అప్పటి రోజులను గుర్తు చేసుకున్న చిరంజీవి

    అప్పటి రోజులను గుర్తు చేసుకున్న చిరంజీవి

    దేవదాస్ కనకాల నటుడిగా, దర్శకుడిగా కంటే... నట శిక్షకుడిగా బాగా గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి, రజనీకాంత్ కూడా ఆయన వద్ద శిక్షణ పొందిన వారే. ఈ సందర్భంగా చిరంజీవి అప్పటి రోజులను గుర్తు చేసుకుంటూ తన గురువులకు నివాళులు అర్పించారు.

    రాజీవ్ కనకాలకు చిరంజీవి ఓదార్పు

    రాజీవ్ కనకాలకు చిరంజీవి ఓదార్పు

    తండ్రి పోయిన విషాదంలో ఉన్న రాజీవ్ కనకాల, ఇతర కుటుంబ సభ్యులకు చిరంజీవి ధైర్యం చెప్పారు. దేవదాస్ కనకాల అనారోగ్యానికి కారణమేంటి? ఎన్ని రోజులుగా చికిత్స పొందుతున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మన మధ్య లేకున్నా జ్ఞాపకాల రూపంలో ఎప్పుడూ జీవించే ఉంటారు అంటూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

    దేవదాస్ కనకాల

    దేవదాస్ కనకాల

    1945లో జూలై 30 న యానం సమీపంలోని కనకాలపేటలో జన్మించిన దేవదాస్ కనకాల విశాఖలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం లో థియేటర్ ఆర్ట్స్ చదివారు. సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్‌లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టారు.

    నట శిక్షకుడిగా గుర్తింపు

    నట శిక్షకుడిగా గుర్తింపు

    నటుడిగా, దర్శకుడిగా రాణించారు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (మద్రాస్) లో ఎ.ఆర్.కృష్ణ సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపర్టరీలోను, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోను అధ్యాపకునిగా మరియు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. చిరంజీవి, రజనీకాంత్‌తో ఎంతో మంది ఆయన వద్ద శిక్షణ పొందారు.

    English summary
    Chiranjeevi Pay homage to Devadas Kanakala. Devadas Kanakala is an Indian actor. He is from Andhra Pradesh who predominantly appeared in Telugu language films. Super Star Rajini Kanth, Chiranjeevi and Rajendra Prasad are the students of Devadas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X