»   » చిరంజీవి పుసుక్కున అలా అన్నారేంటబ్బా.. నూలుపోగుతో సమానమట..

చిరంజీవి పుసుక్కున అలా అన్నారేంటబ్బా.. నూలుపోగుతో సమానమట..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అవార్డులు, రివార్డులు ఎవరికైనా, ఏ రంగాల్లోని వారికైనా ప్రోత్సాహాన్నిస్తాయి. సినీ పరిశ్రమలో అయితే ఇంకా వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. అప్పడప్పుడే పరిశ్రమలో నిలదొక్కుకునే వారైతే వాటిని ప్రాణంగా చూసుకొంటారు. అయితే సినీ దిగ్గజాలకు అవార్డులు, రివార్డుల వచ్చినా పెద్దగా స్పందించకనిపించదు. ఎందుకంటే వారు జీవితంలో ఎన్నో మైలురాళ్ళను అధిగమించి వస్తారు కాబట్టి. ఇదంతా ఎందుకంటే.. కళాతపస్వికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చిన నేపథ్యంలో.. కే విశ్వనాథ్‌ను, బాలును ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ సన్మానించింది. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవేమిటంటే..

సన్మానించుకోవడంలో తప్పులేదు

సన్మానించుకోవడంలో తప్పులేదు

తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్రవేసిన వారిని సన్మానించుకోవడంలో తప్పులేదు. తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటే శంకరాభరణంకు ముందు, ఆ తర్వాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలుగు పరిశ్రమకు మైలురాయిలాంటి ఆ సినిమా అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. విశ్వనాథ్‌తో సినిమాలు చేశాను. నాకు క్లాసు, మాస్‌ ఇమేజ్‌ తీసుకొచ్చింది ఆయన సినిమాలే అని పేర్కొన్నారు.

వారిని అలా గౌరవించడం ఆనందంగా..

వారిని అలా గౌరవించడం ఆనందంగా..

విశ్వనాథ్‌, బాలసుబ్రమణ్యం కాంబినేషన్‌లో ఎన్నో విజయవంతమైన సినిమాలు వచ్చాయి. సినిమా పరిశ్రమకు గౌరవం తచ్చిన వారిని సత్కరించుకోవడం ఆనందంగా ఉంది. ఇలాంటి సన్మానాలు వారికి కొత్తేమీ కాదు. ఇవన్నీ వాళ్లకి నూలుపోగుతో సమానం అని చిరంజీవి అన్నారు.

నేను మీ విశ్వనాథ్‌నే..

నేను మీ విశ్వనాథ్‌నే..

అనంతరం కె.విశ్వనాథ్‌ మాట్లాడుతూ 'అవార్డు వచ్చిందని నేనీ సన్మానానికి రాలేదు. సాధారణమైన వ్యక్తిగా వచ్చా. దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు నాకు ఇప్పుడు వచ్చింది. రేపు ఇంకొకరికి వస్తుంది. ఎప్పటికీ నేను కాశీనాథుని విశ్వనాథ్‌నే' అని చాలా హుందాగా చెప్పడం గమనార్హం.

సినిమాతో 51 ఏళ్ల అనుబంధం

సినిమాతో 51 ఏళ్ల అనుబంధం

ఆ తర్వాత గానగంధర్వుడు బాలు మాట్లాడుతూ... తెలుగు సినిమాతో నాకు 51 ఏళ్ల అనుబంధం ఉంది. ఇంతకాలం నన్ను భరించి ఆదరించిన అందరికీ ధన్యవాదాలు. అన్నయ్య విశ్వనాథ్‌గారి పక్కన కూర్కొని సన్మానం అందుకోవడం గర్వంగా ఉంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు పాల్గొన్నారు.

English summary
Kalatapasvi K Vishwanath, SP Balu felicitated by Filmnagar Cultural Centre. In this meeing Chiranjeevi praised both Telugu Film legendaries. In this program Many celebraties of Tollywood participated.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu