»   » ఎమోషన్ అయిన రామ్ చరణ్, హగ్ తోపాటు వాటర్ బాటిల్ కూడా... (ఫొటోలు)

ఎమోషన్ అయిన రామ్ చరణ్, హగ్ తోపాటు వాటర్ బాటిల్ కూడా... (ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇప్పుడు ఎక్కడ విన్నా చిరంజీవి డాన్స్ గురించే చర్చ. మెగా అభిమానులే కాదు సినీ లవర్స్ సైతం చిరు ఈ వయస్సులో అంటే అరవై సంవత్సరాల వయస్సులో కుర్రాడిలా తన కుమారుడుకే పోటీ ఇచ్చే స్దాయిలో వేసిన స్టెప్స్ కు మురిసిపోయారు. బాస్ ఈజ్ బ్యాక్ అని నినాదాలు చేసారు. మరి బయిటవాళ్లే ఇంతలా ఆనందపడుతూంటే, మరి చిరు కుటుంబం ఎంత ఎమోషన్ అయ్యి ఉంటుంది. వాళ్లు ఎలా ఫీల్ అయ్యి ఉంటారు.

వివరాల్లోకి వెళితే... సినీ 'మా' అవార్డ్స్ 2016 వేడుక జూన్ 12న హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సినీప్రముఖుల మధ్య అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే స్టెప్పులతో ఇరగదీశారు. మెగా హీరోలు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్‌తో పాటు శ్రీకాంత్, సునీల్, నవదీప్ సైతం మెగాభిమాన్ని చాటుకుంటూ చిరంజీవి స్టెప్పులతో జతకలిశారు.

సూపర్ హిట్ చిత్రం 'గ్యాంగ్‌లీడర్' సినిమాలోని టైటిల్ సాంగ్‌‌కు డ్యాన్స్ చేసి ప్రేక్షకుల్ని అలరించారు. చిరు వేసిన స్టెప్స్‌కు ఆడిటోరియం అంతా విజిల్స్‌తో హోరెత్తిపోయింది. ఈ సందర్బంగా ఆడియన్స్ లో ఉండి చూస్తున్న రామ్ చరణ్ ఎమోషన్ అయ్యిపోయారు. ఆయన వెంటనే స్టేజి పైకి వెళ్లి తన తండ్రిని కౌగలించుకుని, వాటర్ బాటిల్ అందచేసారు. ఈ భావోద్వేగం చూసిన అక్కడున్నవారి కళ్లు సైతం చమర్చాయి.

వైట్, బ్లాక్

వైట్, బ్లాక్

వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ తో మెగాస్టార్ చిరంజీవి స్టేజ్ పైకి వచ్చి రెండు మూడు మాటలు అందరితో పంచుకుని.. తన డ్యాన్స్ పెర్ఫామెన్స్ స్టార్ట్ చేశారు.

అంతా షాక్

అంతా షాక్

సిక్ట్సీ ఇయర్స్ ఏజ్ లో చిరు శరీరం బెండ్ అవుతున్న తీరు చూసి.. అందరూ షాక్ పోయారు.

అదొక్కటే కాదు

అదొక్కటే కాదు

గ్యాంగ్ లీడర్ మూవీలో టైటిల్ సాంగ్ - ముఠామేస్త్రిలో టైటిల్ సాంగ్ తో పాటు.. తన పాటలతో కూర్చిన కు కూడా చిరు చిందులేశారు.

విజిల్స్ ,అరుపులు

విజిల్స్ ,అరుపులు

చిరంజీవి డాన్స్ చేస్తున్నసేపూ అభిమానుల కేరింతలు, విజిల్స్ లో మోత మోగించారు.

టాక్ ఆఫ్ ది టౌన్

టాక్ ఆఫ్ ది టౌన్

ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో మెగాస్టార్ చేసిన నృత్యం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

వీరంతా కోరారు

వీరంతా కోరారు

అంతకు ముందు సునీల్, శ్రీకాంత్, సాయి ధరమ్ తేజ్,నవదీప్... తదితరులు స్టేజ్ మీదకు వచ్చి ఓ స్టెప్ వేయాలంటూ చిరంజీవిని కోరడంతో... వద్దు వద్దూ అంటూనే చివరకు వాళ్లతో కలిసి గ్యాంగ్ లీడర్ అంటూ డాన్స్ చేశారు.

అమ్మేసినా

అమ్మేసినా

'మా'టీవీలో చిరంజీవికి కూడా ఒకప్పుడు సహ భాగస్వామి. ఆ మధ్య 'మా' గ్రూప్ ని, స్టార్ గ్రూప్ కి విక్రయించేసారు.

అయినప్పటికీ ...

అయినప్పటికీ ...

మాటీవీతో చిరంజీవి సహా నాగార్జున తదితరులకు అనుబంధం ఇంకా కొనసాగుతోంది.

లైవ్ ఫెరఫార్మెన్స్..

లైవ్ ఫెరఫార్మెన్స్..

మాటీవితో అనుబంధంతోనే, సిని'మా' అవార్డ్స్ కోసం చిరంజీవి.. ఇదిగో ఇలా స్టేజ్ పై లైప్ పెర్ఫామెన్స్ తో అలరించారు.

రిహార్సల్స్

రిహార్సల్స్

వాస్తవానికి, ఈ స్టేజ్ పెర్ఫామెన్స్ని చిరంజీవి తాను నటించబోయే కొత్త సినిమా కోసం రిహార్సల్స్ అనుకోవాలి.

టీజర్..

టీజర్..

ఫాన్స్ కి చాన్నాళ్ళ తర్వాత తన డాన్స్ కి సంబంధించి టీజర్ గానూ స్టేజ్ పై ఇలా చిందేశారని అనుకోవచ్చు.

కత్తి రీమేక్

కత్తి రీమేక్

వినాయక్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తమిళ సినిమా 'కత్తి'ని తెలుగులోకి రీమేక్ చేస్తున్న విషయం విదితమే.

ఫిట్ గా...

ఫిట్ గా...

రాజకీయాల్లోకి వెళ్ళాక, ఫిట్నెస్ మీద ఫోకస్ తగ్గించిన చిరంజీవి, మళ్ళీ ఇప్పుడు ఫిట్ గా తయారయ్యారనడానికి ఇదే నిదర్శనం.

అందుకేనా

అందుకేనా

ఫుల్‌లెంగ్త్ హీరోగా రీ ఎంట్రీ కోసం కసరత్తులు చేస్తున్న చిరు చాలా రోజుల తర్వాత స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు.

స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు...ఫొటోలు

స్లైడ్ షోలో మరిన్ని విశేషాలు...ఫొటోలు

తమిళంలో ఘన విజయం సాధించిన ‘కత్తి' రీమేక్‌తో మెగాస్టార్ ‘కత్తిలాంటోడు'గా వచ్చేందుకు సిద్ధమౌతున్నాడు. ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు.

English summary
When Chiranjeevi’s performance was over, Ramcharan couldn't hold himself back and went up on stage to give him a big hug and water. This sweet gesture really touched our hearts.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu