twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    యండమూరి కించపరిచారు, శ్రీజ పెళ్లిలోనే మళ్లీ అలా చేసా: చిరంజీవి

    ఖైదీ నెం 150 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగా బ్రదర్ నాగబాబు.... ప్రముఖ రచయిత, వ్యక్తిత్వవికాస నిపుడుడు యండమూరి వీరేంద్రనాథ్ ను ఉద్దేశిం ఘాటైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ఖైదీ నెం 150 మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో మెగా బ్రదర్ నాగబాబు.... ప్రముఖ రచయిత, వ్యక్తిత్వవికాస నిపుడుడు యండమూరి వీరేంద్రనాథ్ ను ఉద్దేశిం ఘాటైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వ్యక్తిత్వ వికాసం గురించి చెప్పే అతనికే వ్యక్తిత్వం లేదని, అతడో కుసంస్కారి అంటూ నాగబాబు మండి పడ్డారు.

    గతంలో యండమూరి ఓ కాలేజీ ఫంక్షన్లో రామ్ చరణ్ ను ఉద్దేశించి చేసిన కామెంట్సే ఇపుడు నాగబాబు ఫైర్ అవ్వడానికి కారణం. చిరంజీవితో కలిసి అభిలాష సినిమాకు పని చేసాను. అప్పట్లో చరణ్ ను హీరోను చేసేందుకు అతని తల్లి సురేఖ ఎంతో కష్టపడేది. డాన్సులు నేర్పేది. అప్పట్లో ఆ అబ్బాయి దవడ సరిగా ఉండేది కాదు. తర్వాత దాన్ని సరిచేయించారు. అదే సమయంలో మరో ఎనిమిదేళ్ల కుర్రాడు మాత్రం ఎంతో ప్రతిభ కనబరిచేవాడు. ఇళయరాజా స్వరపరిచిన అబ్బనీ తియ్యనీ దెబ్బ పాట విని, ఇది శివ రంజనీ రాగం అని గుర్తు పెట్టాడు, దీంతో ఇళయరాజా ఆ అబ్బాయిని మెచ్చుకున్నాడు. అతనే ఇపుడు దేవిశ్రీ ప్రసాద్ అయ్యాడు. రామ్ చరణ్ పేరు చెప్పినపుడు మీరు చప్పట్లు కొట్టలేదు, కానీ దేవిశ్రీ పేరు చెప్పినపుడు చప్పట్లు కొట్టారు. ఎందుకంటే దేవిశ్రీ స్వశక్తికతో పైకొచ్చాడు. నువ్వే ఏంటీ అన్నది ముఖ్యం. మీ నాన్న ఎవరు అన్నది కాదు... అంటూ అప్పట్లో యండమూరి చేసిన కామెంట్స్ గురించి అందరికీ తెలిసిందే.

    ఈ సంఘటనపై తాజాగా టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చిరంజీవి స్పందించారు. దీంతో పాటు తన 150వ సినిమాకు సంబంధించిన అనేక విషయాలు చెప్పుకొచ్చారు.

    యండమూరి కామెంట్స్ కించ పరిచే విధంగా ఉన్నాయి

    యండమూరి కామెంట్స్ కించ పరిచే విధంగా ఉన్నాయి

    నాపై చేసే విమర్శలను నేను పట్టించుకోను, కానీ నాగబాబు తట్టుకోలేడు. కొందరు సంస్కారం లేకుండా మాట్లాడతారు. యండమూరి కామెంట్స్ కించ పరిచే విధంగా ఉన్నాయి కాబట్టే నాగబాబు అలా మాట్లాడారు అని చిరంజీవి తన సోదరుడి కామెంట్స్ ను సమర్థించుకున్నారు.

    నాగబాబు కామెంట్స్ విని సర్‌ప్రైజ్ అయ్యాను.

    నాగబాబు కామెంట్స్ విని సర్‌ప్రైజ్ అయ్యాను.

    వ్యక్తిత్వ వికాసం క్లాసుల్లో నలుగురికీ స్పూర్తినిచ్చే కామెంట్స్ చేయాలి. కానీ సంస్కారం లేని పద్దతిలో యండమూరి మాట్లాడారు. ఖైదీ ప్రీ రిలీజ్ వేడుకలో నాగబాబు అలా మాట్లాడటం చూసి సర్‌ప్రైజ్ అయ్యాను అని చిరంజీవి వ్యాఖ్యానించారు.

    శ్రీజ పెళ్లిలోనే

    శ్రీజ పెళ్లిలోనే

    సినిమాలకు దూరం అయిన తర్వాత మధ్యలో డాన్స్ ఎప్పుడూ చేలేదు. ఆ మధ్య శ్రీజ పెళ్లిలోనే చాలా కాలం తర్వాత డాన్స్ చేసారు. ఇపుడు 150వ సినిమాలో చేసారు. సినిమాలో డాన్సులు బాగా కంపోజ్ చేసారు అని చిరంజీవి అన్నారు.

    రెండు క్యారెక్టర్లు

    రెండు క్యారెక్టర్లు

    ఖైదీ నెం 150 సినిమాలో రెండు క్యారెక్టర్లు చేసారు. రెండు క్యారెక్టర్లు అభిమానులను ఆకట్టుకునే విధంగా ఉంటాయి. సినిమాలో ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాలు ఉంటాయని చిరంజీవి చెప్పుకొచ్చారు.

    శాతకర్ణితో పోటీపై

    శాతకర్ణితో పోటీపై

    సంక్రాంతి పోటీ ఆరోగ్యకరమైనదే, సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు విడుదలైనా ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చిరంజీవి అన్నారు. ఇన్నాళ్లు అభిమానులను మిస్సయ్యాను. ఖైదీ ఫంక్షన్లో అభిమానులు భారీగా తరలిరావడం చూసి సంతోషించాను అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

    పవన్ అందుకే రాలేదు

    పవన్ అందుకే రాలేదు

    బిజీగా ఉండటం వల్లే పవన్...ఖైదీ పంక్షన్ కు రాలేక పోయారని, అంతకు మించి మరేమీ లేదన్నారు. రాజకీయంగా ఇద్దరి దారులు వేరైనా గమ్యం ఒక్కటే అన్నారు. పవన్ కు మంచి ఐడియాలజీ ఉంది, నిజాయితీ పరుడు, మంచి ఆశయం కలవాడు అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

    మా ఆవిడే డైటీషియన్

    మా ఆవిడే డైటీషియన్

    150వ సినిమాలో నటించాలని నిర్ణయం తీసుకున్న తరువాత ముందు శారీరకంగా సన్నద్ధం కావాలని నిర్ణయించామని ప్రముఖ నటుడు చిరంజీవి తెలిపారు. ఈ క్రమంలో మేకోవర్ సాధించేందుకు చాలా కష్టపడ్డాను, మామూలుగా తాను మంచి భోజన ప్రియుడినని, అయితే నచ్చినదంతా తినకుండా సురేఖ జాగ్రత్తపడేదని, కొంచెం కూడా ఎక్కువ తిననిచ్చేవారు కాదని ఆయన చెప్పారు.

    రామ్ చరణ్

    రామ్ చరణ్

    శారీరకంగా సన్నద్ధం అయ్యే క్రమంలో రామ్ చరణ్ తనకు ట్రైనర్ గా మారాడని, బాగా అలసిపోయి విశ్రాంతి తీసుకుందామని భావించినా ఊరుకునేవాడు కాదని, తనను ఉత్సాహపరిచి, జిమ్ కు తీసుకెళ్లేవాడని, తన భార్య, కుమారుడి సహకారంతో మేకోవర్ సాధించానని, తానీ సినిమాలో ఫిట్ గా కనిపించేందుకు వారిద్దరూ సహకరించారని చిరంజీవి తెలిపారు.

    నేను అలాంటి సినిమాలు చేస్తే చూడరు

    నేను అలాంటి సినిమాలు చేస్తే చూడరు

    అమీర్ ఖాన్ నటించిన 'దంగల్', సల్మాన్ ఖాన్ నటించిన 'సుల్తాన్', షారూఖ్ ఖాన్ నటించిన 'చక్ దే ఇండియా' వంటి సినిమాలు అద్భుతంగా ఉన్నాయని చిరంజీవి తెలిపారు. అయితే అలాంటి సినిమాలు తాను చేస్తే అభిమానులు చూడరని ఆయన అన్నారు.

    కమర్షియల్

    కమర్షియల్

    తన సినిమాలలో అభిమానులు ఆశించే అంశాలు చాలా ఉంటాయని, వారిని ఆనందపరచాలంటే తాను కమర్షియల్ సినిమాలే చేయాలని, అందుకే అలాంటి సినిమాలు చేసే అవకాశం లేదని చిరంజీవి తేల్చిచెప్పారు.

    సందేశం కూడా ముఖ్యమే

    సందేశం కూడా ముఖ్యమే

    అయితే తన సినిమాల్లో కమర్షియల్ హంగులు ఉండేలా చూస్తూనే సందేశమిచ్చే ప్రయత్నం చేస్తానని, అందుకు నిదర్శనంగా 'స్టాలిన్', 'ఠాగూర్' వంటి సినిమాలని గతంలో చేశానని ఆయన తెలిపారు. 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో కూడా అద్భుతమైన సందేశం ఉందని ఆయన చెప్పారు.

    English summary
    Chiranjeevi responds on Nagababu Comments about Yandamuri Veerendranath. Check out details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X