»   » చిరు 150 సినిమా దర్శకుడు ఖరారు, బిఏ రాజు స్టేట్మెంట్

చిరు 150 సినిమా దర్శకుడు ఖరారు, బిఏ రాజు స్టేట్మెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమా కోసం ఆసక్తిగా ఎదరు చూస్తున్న అభిమానులకు శుభవార్త. ఆయన 150వ సినిమాకు దర్శకత్వం వహించబోయే దర్శకుడు ఎవరనేది ఖరారైంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ చిరంజీవి 150వ సినిమాను హ్యాండిల్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ప్రముఖ పిఆర్ఓ బి.ఏ.రాజు కూడా ధృవీకరించినట్లు సమాచారం. పూరికి సన్నిహితంగా ఉండే హీరోయిన్ చార్మి కూడా ఇదే విషయమై తన ట్విట్టర్ ద్వారా క్లూ ఇచ్చింది. బి.ఏ.రాజు కూడా ఖరారు చేయడంతో మెగా ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు.

ఈ సినిమా 1940-50 కాలం నాటి బ్యాక్ డ్రాపుతో ఉంటుందిన సమాచారం. ప్రస్తుతానికి దర్శకుడు పూరి జగన్నాథ్ అనే విషయం మాత్రమే ఖరారైంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. పూరి దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా వస్తుందనగానే అభిమానులు కాన్ఫిడెంటుగా ఉన్నారు.

Chiranjeevi’s 150th Confirmed with Puri

నిన్న మొన్నటి వరకు చిరంజీవి 150వ సినిమాపై చాలా రకాల ప్రచారం జరిగింది. ఆయన సినిమా వినోదాత్మకంగా ఉంటుందని....ఇందుకోసం పూరి జగన్నాథ్ ‘ఆటో జానీ' అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు కూడా టాక్. అయితే ఇపుడు సినిమా బ్యాక్ డ్రాపు 1940-50 కాలం నాటిది అనే విషయం బయకు రాగానే ఇది ఎలాంటి కాన్సెప్టు అయి ఉంటుంది? స్వాతంత్రోద్యమ కాలం నాటి సంఘటనలకు సంబంధించిన అంశాలు ఇందులో ఉంటాయా? సినిమా పూర్తి సందేశాత్మకంగా, దేశభక్తిని రేకెత్తించే విధంగా ఉంటుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతోంది.

ఆ మధ్య చిరంజీవి ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ఊయ్యాల వాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రలో నటిస్తాడనే ప్రచారం జరిగింది. మరి అప్పటి ప్రచారమే నిజం కాబోతోందా?...... ఇవన్నీ తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. చిరంజీవి పుట్టినరోజు నాటికి 150వ సినిమాకు సంబంధించి విషయాలపై పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించబోతున్నారు. బండ్ల గణేష్ సహనిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది.

English summary
Good news for Chiranjeevi’s fans. The much awaited 150th film is finally moving ahead and Puri Jagan will be handling the direction. The news has been confirmed by well known PRO B.A. Raju.
Please Wait while comments are loading...