»   » చిరంజీవి 150వ సినిమాకు ముహూర్తం ఫిక్స్

చిరంజీవి 150వ సినిమాకు ముహూర్తం ఫిక్స్

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమాకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. చిరంజీవి 150వ సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 29న మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు సినిమా ప్రారంభోత్సవ ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. తమిళ హిట్ మూవీ 'కత్తి’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కబోతోంది. 

chiranjeevi

ఈ ప్రారంభోత్సవ వేడుక గ్రాండ్ గా జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ఈ వేడుకకు ఇండస్ట్రీలోని ప్రముఖులంతా హాజరుకాబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ 'కత్తి’ స్టోరీని తెలుగు నేటివిటీకి  తగిన విధంగా, మెగా అభిమానులకు నచ్చే విధంగా మార్పులు చేయించారు వివి వినాయక్. 

ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. గత మూడేళ్లుగా ఈ సినిమా కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. వాస్తవానికి ఈ సంవత్సరం మొదటల్లోనే సినిమా మొదలవ్వాల్సి ఉన్నా.... చిరంజీవి చిన్నకూతురు శ్రీ వివాహం కారణంగా సినిమా ప్రారంభోత్సవం వాయిదా పడింది. 

వివి వినాయక్

ఈనెల 30వ తేదీ తర్వాత మంచి ముహూర్తాలు లేనందున....ఈ నెల 29న సినిమా ప్రారంభోత్సవ ముహూర్తం నిర్ణయించినట్లు తెలుస్తోంది. మాస్ మసాలా ఎంటర్టెనర్ గా, అభిమానులకు విందు భోజనంలా ఈ సినిమా ఉండబోతోంది. పూర్తి కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 

English summary
According to latest reports, the landmark project of Megastar Chiranjeevi will be launched on April 29. The launch event will be grand and will be attended by many starts from Tollywood. The Muhurtham shot will also take place on the same date. All the details regarding the flick are likely to be confirmed by evening.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu