»   » చిరంజీవి 150: తమిళ రీమేక్ ఖరారైంది

చిరంజీవి 150: తమిళ రీమేక్ ఖరారైంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా అభిమానులకు ఇది శుభవార్తే. చిరంజీవి చేయబోయే 150వ సినిమా ఖరారైంది. తమిళంలో సూపర్ హిట్టయిన ‘కత్తి' చిత్రాన్ని తెలుగులో చిరంజీవితో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. చెన్నై నుండి అందుతున్న సమాచారం ప్రకారం రామ్ చరణ్ ఈ చిత్రం రీమేక్ రైట్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో చిరంజీవి డబల్ రోల్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విషయమై రామ్ చరణ్ అఫీషియల్ ప్రకటన చేసే అవకాశం ఉంది. దర్శకుడు ఎవరు అనేది ఫైనల్ చేసిన తర్వాత ఈ విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించే అకవాశం ఉందని అంటున్నారు.

Chiranjeevi's 150th film is 'Kaththi' remake

గతంలో ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ఠాగూర్ మధు ప్రయత్నించారు. ఇందుకోసం ఆయన పవన్ కళ్యాన్, ఎన్టీఆర్ లను సంప్రదించారు. అయితే వారు ఈ సినిమా రీమేక్ చేయడానికి ఆసక్తి చూపలేదు. అయితే వారిద్దరూ వద్దనుకున్న ఈ ప్రాజెక్టును చిరంజీవి ఒప్పుకున్నారనే విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

మరో వైపు చిరంజీవితో 150వ సినిమా చేసే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారింది పూరి జగన్నాథ్ కి. దీనిపై ఆయన స్పందిస్తూ చిరంజీవిగారి 150వ సినిమా చేయడానికి నాకే ఎక్కువ హక్కుందని నా నమ్మకం. ఎందుకంటే అందరికన్నా నేనే ఆయనకి పెద్ద అభిమానిని. ఆయన తెర మీద ఎలా ఉంటే బావుంటుందో ఫ్యాన్స్ కే బాగా తెలుసు. ఆయనకు కూడా తెలీదు. ఈకథ కుదరక పోతే ఇంకో కథ చేస్తా.. అదీ కుదరక పోతే ఆయనకు నచ్చే వరకు చేస్తా. 150వ నేనే చేస్తా... లేదంటే 151 చేస్తాం.. ఎప్పటికైనా చిరంజీవిగారితో సినిమా చేయాలనేదే నా కోరిక అంటూ ఫేస్ బుక్ లో పోస్టు చేసాడు పూరి.

ప్రస్తుతం చిరంజీవి రామ్ చరణ్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘బ్రూస్ లీ' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవి గెస్ట్ రోల్ లో కేవలం 3 నిమిషాలు మాత్రమే కనిపించనున్నారు. ఇటీవల ఆయనపై మూడు రోజుల పాటు చిత్రీకరణ జరిగింది.

English summary
According to our Chennai sources, Ram Charan has bought the remake rights of the film for a very good price. So Chiranjeevi will be seen in a dual role in his landmark movie. An official announcement is expected to be made by Charan soon.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu